Village Peoples Kills 5 Pythons in Eluru District: సాధారణంగా పామును చూస్తేనే మనం ఒక్కసారిగా హడలిపోతాం. ఎక్కడైనా పాము కనిపిస్తే భయంతో దూరంగా పారిపోతాం. అలాంటిది ఏకంగా ఐదు కొండచిలువలు కనబడితే ఇంకేమన్నా ఉందా?. ఆ భయాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి పరిస్థితే ఏలూరు జిల్లా వాసులకు ఎదురైంది. నిత్యం కోళ్లను తింటున్న ఐదు కొండచిలువలను శనివారం (మార్చి 4) ఉదయం హతమార్చారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానికుల వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలోని తిరుమలదేవి పేట పంచాయతీకి చెందిన మల్లప్ప గూడెం గ్రామంలో గత కొద్ది రోజులుగా ఇళ్లల్లో ఉన్న కోళ్లు మాయం అవుతున్నాయి. గ్రామస్తులు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కోళ్లు ఎలా మాయం అవుతున్నాయో తెలుకునేందుకు గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కొండచిలువ జాతి చెందిన పాములను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. 



మల్లప్ప గూడెం గ్రామం సమీపంలోని పంట పొలాల వద్ద కొండచిలువ (Python Man Vial Video) జాతి చెందిన ఐదు పాములు ఉండడం గమనించి.. గ్రామస్తులు కర్రలను తీసుకుని అక్కడికి వెళ్లారు. చాలా మంది కలిసి ఈరోజు ఉదయం 5 కొండచిలువ పాములను హతమార్చారు. ఆపై వాటన్నింటిని రోడ్డుపై పడేసి వీడియోలు తీశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది బాబోయ్ అని భయపడుతున్నారు.  


Also Read: Mahindra Thar Price Hike 2023: 'థార్' కార్ ప్రియులకు షాక్.. ధరలను పెంచేసిన మహీంద్రా! పూర్తి వివరాలు ఇవే


Also Read: Tata Nexon Price 2023: కేవలం 6 లక్షలకే టాటా నెక్సాన్‌.. నో వెయిటింగ్ పీరియడ్! రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఇంటికి తీసుకెళ్లండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.