Python Snake: నిత్యం సోషల్‌ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ కావడం విశేషం. అయితే ఇలాంటి వీడియోలు కొన్ని భయాందోళనలకు గురిచేస్తే మరి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పలు సందర్భాల్లో స్నేక్‌ క్యాచర్‌ కూడా పాములను పట్టడానికి భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా వాటిని చూసి భయపడి పక్కకు పారిపోయే స్నేక్‌ క్యాచర్స్‌ కూడా ఉంటారు. మీరు ఎప్పుడు చూడని మహిళ స్నేక్‌ క్యాచర్‌ వీడియోను మీకు ఇప్పుడు చూపించబోతున్నాం.. అవును ఇది నిజం మహిళలు కూడా పాములను పట్టుకుంటారు. ఇలా పట్టుకోవడం చాలా అరుదు. కానీ మేము ఇప్పడు చూపించే వీడియోలో చూడొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ఈ వీడియోలోని సన్నివేశాలు చూసినట్టైతే.. ఒక యువతి పామును పట్టుకునేందుకు తన బైక్‌ పైన పాము సంచరించిన ప్రదేశానికి వస్తుంది. ఆ ప్రాంతంలోని ఉన్న ఓ పైపులోకి కొండ చిలువ దూరింది గమనించి ఆమె దానిని పట్టుకునేందుకు స్నేక్‌ క్యాచర్‌ వినియోగించే స్టిక్‌ను వినియోగిస్తుంది. అంతేకాకుండా దానిని పట్టు కునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అక్కడ చీకటి ఉండడంతో ఆ పాము పట్టుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అయితే చివరకు ఆ యువతి కొండ చిలువను పైపుల నుంచి బయటకు తీస్తారు.



అయితే బయటకు తీసిన తర్వాత ఆ పాము పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కొండ చిలువలు ఎక్కువగా పరిగేత్తవు. అవి చెట్లపై పుట్టలపై నెమ్మదిగానే పాకుతూ ఉంటాయి. దీంతో ఆ పాము కూడా చిన్నగా పాకుతూ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆమె గమనించి పామును పట్టుకుని పైపులోకి దూరిపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ కొండ చిలువ పైపులోకి దూరుతుంది. చివరకు ఆ పైపుకు మూత పెట్టి.. పామును ఆటవి ప్రాంతంలోని వదిలేస్తుంది.


ప్రస్తుతం స్నేక్‌ క్యాచర్స్ వారు పట్టుకునే పాములకు సంబంధించిన పాముల వీడియోలను యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ వీయోడిలే నెట్టింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అంతేకాకుండా మంచి ప్రజాధారణ పొందుతున్నాయి. అయితే ఈ వీడియోను "అవనిని రక్షించు" అనే యూట్యూబ్‌ చానెల్‌ పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 4లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా వీడియోను 3 లక్షల మంది లైక్‌ చేశారు.


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook