Rahul Gandhi marriage with praniti shinde rumours: బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తలలో ఉంటుంది. మరోవైపు పాలిటిక్స్ లో కూడా.. 54 ఏళ్ల  పాలబుగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన కూడా ట్రెండింగ్ లో ఉంటునే ఉంటుంది. ఆయనను ఇప్పటికే పలు సమావేశాలు, వేదికలపై ఎప్పుడు... మీ పెళ్లి అంటూ కార్యకర్తలు అడిగిన సందర్భాలు కొకొల్లలు. ఈక్రమంలో ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అతి తొందరలోనే  పెళ్లిచేసుకోబోతున్నారని, సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండెను పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఏలా చేయాలి.. ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్ గా రాహుల్ పెళ్లి ఉండాలని కూడా .. చర్చించుకుంటున్నారంట.


దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం..  పెళ్లి ఎక్కడైతే.. ఏర్పాటు బాగా చేయగలమో.. కూడా చర్చించుకుంటున్నారంట.ఈ వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్న.. ప్రణితి షిండే ఎవరా.. అంటూ కూడా నెటిజన్ లు గూగూల్ లో తెగ వెతుకుతున్నారంట.


పూర్తి వివరాలు..


ఎట్టకేలకు రాహుల్ గాంధీ తొందరలోనే ఒక ఇంటి వాడౌతున్నారంట. ఆయన సోలాపూర్ ఎంపీ.. ప్రణితి షిండేను పెళ్లి చేసుకోబుతున్నారంట. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. సుశీల్ కుమార్ షిండే కూతరు.. ప్రణితి షిండే. ఇటీవల భారత్ జోడోయాత్రలోసైతం.. మహారాష్ట్రలో.. చేతితో చేయ్యివేసుకుని రాహుల్, ప్రణితిలు చాలా క్లోజ్ గా కన్పించారు. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ రూమర్స్ ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.


మరోవైపు  ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశాక.. ప్రణితి షిండే.. రాహుల్ ను ప్రత్యేకంగా విష్ చేశారు.దీంతో తొందరలోనే తమ 54 ఏళ్ల పాలబుగ్గల నేత.. ఒక ఇంటి వాడౌతున్నాడని కూడా.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారంట. మరోవైపు రాహుల్ గాంధీ  ఎక్కడికి వెళ్లిన ఆయన పెళ్లి ప్రస్తావన మాత్రం హాట్ టాపిక్ గానే ఉంటుంది.


ఇటీవల.. మే 13న, రాయ్‌బరేలీలో జరిగిన ర్యాలీలో, రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని.. కొంత మంది కార్యకర్తలు ప్రియాంక గాంధీని ప్రశ్నిస్తారు. దీంతో  ప్రియాంక మాత్రం.. దీనికి సమాధానం రాహుల్ ఇవ్వాలని కూడా నవ్వుతు చెప్తుంది. అంతేకాకుండా.. ఇటీవల రాహుల్ జమ్ముకశ్మీర్ కు వెళ్లినప్పుడు సైతం.. అక్కడి విద్యార్థులు రాహుల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని కూడా ప్రశ్నించారంట.


Read more: Viral video: పెళ్లైన 2 నెలలకే ముఖేష్ అంబానీ చిన్నకోడలు రాధిక ప్రెగ్నెంట్..?.. ఈ వీడియో చూశారా..?


దీనికి ఆయన.. గత 20, 30 ఏళ్లనుంచి పెళ్లి ప్రస్తావను నాన్చుతూ వస్తున్నానంటూ సరదాగా మాట్లారంట. ఈ క్రమంలో ప్రస్తుతం మాత్రం.. సోలాపూర్ ఎంపీతో మాత్రం పెళ్లి ఫిక్స్.. అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. మరీ దీనిపై రాహుల్ గాంధీ, ఆయన ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో వేచీ చూడాలి.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.