Rajasthan Engineer Wedding With Robo: సాధారణంగా ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీదకల్గుతుందో ఎవరు చెప్పలేరు. కొందరు తమతో పాటు చదివిన వారితో ప్రేమలో పడుతుంటారు. మరికొందరు మాత్రం.. స్కూల్ డేస్ లలో, కాలేజీ రోజులల్లో తమతో పాటు చదివిన వారతో ప్రేమలో పడుతుంటారు. కానీ అప్పుడు కల్గింది కేవలం ఆకర్షణ మాత్రమే. కొందరు జాబ్ లు చేసే చోట కూడా ప్రేమలో పడుతుంటారు. ఒకరితో మరోకరు కొంత కాలంపాటు జర్నీకూడా చేస్తారు. ఇలా జర్నీ చేయడం వల్ల ఇద్దరి మధ్యలో ఉన్న అభిప్రాయలు, ఆలోచనలు ఒకరితో మరోకరు పంచుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏవైన బేదాభిప్రాయాలు ఏర్పడటం వల్ల విడిపోతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More:Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..


కొందరు యువత.. తమ కాలేజీలో క్లాసులో చేప్పే టీచర్లతో కూడా ప్రేమలో పడుతుంటారు. ఇదంతా కామన్. మనకు తెలిసిందే. కానీ కొందరు మాత్రం వెరైటీగా జంతువులతో ప్రేమలో పడుతుంటారు. ఇంకొందరు చెట్లతో, వస్తువులతో కూడా ప్రేమలో పడేవాళ్లను చూశాం. కానీ తాజాగా, ఒక యువకుడు  రోబోతో ప్రేమలో పడినట్లు తెలిపాడు. అంతేకాకుండా మూఢాల్లోనే పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది,


రాజస్థాన్ కు చెందిన సూర్యప్రకాశ్ రోబోటిక్స్ రంగంలో మంచి నిపుణత సాధించాడు. ఇతను.. అనేక రోబోలను తయారుచేశాడు. అయితే.. గిగా అనే లేడీ రోబోతో మాత్రం ప్రేమలో పడ్డట్లు తెలిపాడు. దాన్ని పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ గిగా రోబో తయారౌతుందని,దీని కోసం దాదాపుగా.. 19 లక్షల వరకు ఖర్చు అవుతుందని కూడా సమాచారం. ఇదిలా ఉండగా.. అతను రోబోతో పెళ్లికి కూడా రెడీ అయిపోయాడంట. ఇంట్లో వాళ్లు కూడా దీనికి అంగీకరించారంట.


Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..


సూర్య తొందరలోనే లేడీ రోబోను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. సూర్యతొందరలోనే.. నేవీ రంగంలో ఉద్యోగంలో చేరుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈఘటన వెలుగులోకి రావడంతో కొందరు షాక్ కు గురౌతున్నారు. రోబోతో పెళ్లి ఏంటని కొందరు వింతగా చూస్తున్నారు. మరికొందరు మూడాలున్నాయని,ఇప్పుడు పెళ్లి చేసుకోక పోవడం మంచిదంటూ కూడా సలహాలు ఇస్తున్నారు. ఈఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter