Rajasthan Engineer Suspended: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కిన ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు
Rajasthan Engineer Suspended: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్‌ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.
Rajasthan Engineer Suspended: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన జూనియర్ ఇంజనీర్ ని ఆ రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. జనవరి 4న రాజస్థాన్ లోని పాలి జిల్లాలో జరిగిన స్కౌట్ గైడ్ ఆరంభోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో జూనియన్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న అంబ సియోల్ రాష్ట్రపతి పాదాలను తాకేందుకు యత్నించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సదరు జూనియర్ ఇంజనీర్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించిన నేరం కింద ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలిస్తే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలీప్యాడ్ వద్ద హెలీక్యాప్టర్ దిగి వస్తుండగా.. ప్రథమ పౌరురాలికి స్వాగతం పలికేందుకు వెళ్లిన స్థానిక నేతలు, అధికారుల బృందంలో ఒకరిగా ఉన్న జూనియర్ ఇంజనీర్ అంబ సియోల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంటుండటం అక్కడి వీడియోలో చూడొచ్చు. అంబ సియోల్ రాష్ట్రపతిని సమీపించడం గమనించిన భద్రతా బలగాలు.. వెంటనే అంబ సియోల్‌ని వారిస్తూ అడ్డుగా రావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. అంబ సియోల్ చర్యను తేలిగ్గా తీసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడి నుంచి తన కోసం వేచిచూస్తున్న వాహనం వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.
రాష్ట్రపతి సెక్యురిటీ ప్రోటోకాల్‌ని ఉల్లంఘిస్తూ ఒక ఉద్యోగి రాష్ట్రపతికి అతిదగ్గరిగా వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ చేపట్టి జనవరి 12న సస్పెన్షన్ ఆర్డర్స్ పాస్ చేసింది. అంబ సియోల్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాజస్థాన్ ప్రభుత్వం.. తక్షణమే ఆమెను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఆ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.