Rajasthan Family Dispute Married Women Fight With Husband Over liquor And Mutton: కొందరు అమ్మాయిలు మరీ వెరైటీగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఉన్న డిమాండ్ వల్ల వాళ్ల కోరికల చిట్టాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొవాలంటే, బంగ్లా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్, కారుఉండాలి అని డిమాండ్ ల చిట్టా పెడుతున్నారు. మరికొందరైతే.. సపరేట్ గా ఫ్యామిలీ పెట్టాలని, పెళ్లికి ముందే ప్రాపర్టీ అంతా తనపేరుమీద రాయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఇంట్లో పెద్దవాళ్లు ఉండకూడదు.. సపరేట్ గా ఫ్యామిలీ పెట్టలని కూడా డిమాండ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక అమ్మాయిల తక్కువగా ఉండటం వల్ల కొందరు పెళ్లికూతుళ్ల తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. మరికొందరు అమ్మాయిలైతే మరీ ఘోరంగా.. ఇల్లరికం రావాలని కూడా అబ్బాయిలకు ఆప్షన్ ఇస్తున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


రాజస్థాన్ లోని బన్ స్వారాలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన నేహాజైన్ తో, చిరాగ్  ఏడాది క్రితం పెళ్లిజరిగింది. ఏడాది పాటు వీరి కాపురం బాగానే సాగింది. కొన్నిరోజుల తర్వాత నేహజైన్ తన అసలురంగును బైటపెట్టింది. అప్పటిదాక, ఆమెకు మందుతాగే అలవాటు ఉందనే విషయం దాచిపెట్టింది. అంతేకాకుండా.. ప్రతిరోజు చికెన్ తినకుండా అస్సలు ఉండలేనని కూడా చెప్పింది. తన భర్తతో.. ప్రతిరోజు మద్యం కావాలని గొడవపెట్టుకునేది.


అంతటితో ఆగకుండా.. ఎప్పుడైన చికెన్ లేకుంటే ఇంట్లో ఆరోజు గొడవలే. ఇంకా మందు, చికెన్ విషయంలో భార్యభర్తల మధ్యతరచుగా గొడవలు జరిగేవి. దీంతో భర్త ఆమెతో గొడవలకు విసిగిపోయాడు.ఈ క్రమంలో.. నేహాజైన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది.


Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..


ప్రతిరోజు మద్యం, మాంసం ఉంటేనే ఇంటికి వస్తానని, లేకుంటే వచ్చేదిలేదని తెల్చిచెప్పింది. దీంతో చిరాగ్ ఇదేం గొడవరా బాబు అంటూ తలలు పట్టుకున్నాడు. చేసేది లేక తన సమస్యను పరిష్కరించాలని రాజస్థాన్ లోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ  ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం రచ్చరా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook