Viral video: కిడ్నాపర్ ప్రేమకు ఫిదా అయిన బుడ్డొడు.. ఇంటికి వెళ్లనంటూ రచ్చ.. వీడియో వైరల్..
Jaipur child kidnapped news: కొన్నినెలల క్రితం 11 ఏళ్ల బాలుడు ఆగ్రాలో తప్పిపోయాడు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత అది కిడ్నాప్ అని విచారణలో తెలింది. తాజగా.. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అప్పుడు జరిగిన సంఘటన కాస్త వైరల్ గా మారింది.
Jaipur 11 years child kidnapped incident goes viral: సాధారణంగా చిన్న పిల్లలు ఎంతో అమాయకంగా ఉంటారు. తమతో ప్రేమతో మాట్లాడిన, ప్రేమను చూపించిన కూడా వెంటనే వారిని అస్సలు వదలరు. కొంత మందికి పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అందుకే ఎప్పుడైన పిల్లలు కన్పిస్తే..వెంటనే చాక్లెట్ లు, బిస్కట్ లు కొనిస్తుంటారు. పిల్లలు కూడా వారి పట్ల అంతే ప్రేమతో ఉంటారు. తమను ప్రేమతో చూసుకునే వారు ఒక్కరోజు కన్పించకుంటే.. బాధతో విలవిల్లాడిపోతుంటారు.
ఇటీవల కిడ్నాపర్ లు కూడా కొంత మంది పిల్లలకు చాక్లెట్ లు, బిస్కట్ లు ఇచ్చి పిల్లల్నిఎత్తుకుని పోతున్నారు. మొదట మంచిగా మాట్లాడి లేదా మీవాళ్లు అక్కడున్నారు.. ఇక్కడున్నారంటూ మాటల్లో దింపి కిడ్నాప్ చేస్తున్నారు. అంతేకాకుండా.. కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ లు చేస్తున్నారు. అడిగినంతా డబ్బుల్ని ఇవ్వకుంటే.. చంపడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ఒక జైపూర్ లో ఒక 11 ఏళ్ల బాలుడ్ని ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇటీవల పోలీసులు ఎట్టకేలకు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో ఒక ఎమోషనల్ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
రాజస్థాన్ లోని జైపూర్ లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. 14 నెలల క్రితం.. కుక్కు అనే 11 ఏళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అతడిని తనూజ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశారు. అప్పటినుంచి అతను వేషం మార్చుకుంటూ.. పోలీసులకు చిక్కకుండా అనేకచోట్ల తిరిగినట్లు తెలుస్తోంది. కనీసం మొబైల్ ఫోన్ లను కూడా ఉపయోగించలేడని తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కిడ్నాప్ చేసిన నిందితులు తనూజ్ గతంలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. కానీ అతను అక్రమాలకు పాల్పడటంతో విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. బాలుడ్ని కిడ్నాప్ చేసి అప్పటి నుంచి పలు చోట్ల మకాం మారుస్తు తిరుగుతున్నాడు. అతని మీద పోలీసులు 25 వేల రివార్డును సైతం ప్రకటించారు. బాలుడి తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లాడి కోసం పరితపించిపోతున్నారు. ఏడాదిగా తమ బిడ్డ కోసం కంటి మీద కునుకులేకుండా వెతుకుతూనే ఉన్నారు. చివరకు తమ బిడ్డు.. యమునా కు సమీపంలో... ఖాదర్ ప్రాంతంలో ఉన్నాడని తెలిసింది. వెంటనే పోలీసుల సహాకారంలో అక్కడికి వెళ్లారు.
నిందితుడు తనూజ్ ను అదుపులోకి తీసుకుని, బుడ్డొడిని తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పుడొక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలుడు.. తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు మాత్రం ఇష్టపడలేదు. సదరు కిడ్నాపర్ వద్దకే ఉండేందుకు ఇష్టపడ్డారు. బలవంతంగా అతని కుటుంబ సభ్యులు ఎత్తుకునేందుకు ప్రయత్నించగా .. అతను గుక్కపెట్టి ఏడ్చాడు.
కిడ్నాపర్ తనూజ్ తనను ఎవరు కూడా గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుకుని సన్యాసిలా మారి, నివసిస్తున్నారు. ఈ క్రమంలో బాలుడ్ని..కిడ్నాపర్ బాగా చూసుకున్నాడో.. మరేంటోకానీ..సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. చిన్న పిల్లాడు.. కిడ్పాపర్ పట్ల చూపించిన ఎమోషన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.