Realme Smartphone: భారీ డిస్కౌంట్, మరింతగా తగ్గిన రియల్ మి 6 సిరీస్ ఫోన్ ధరలు
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు రియల్ మి కంపెనీ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇటీవల లాంచ్ చేసిన రియల్ మి 6 సిరీస్ ఫోన్ల థరల్ని భారీగా తగ్గించింది. రియల్ మి 6 సిరీస్ ధరలు, ఫీచర్లు ఇవే..
స్మార్ట్‌ఫోన్ ( Smartphone ) మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు రియల్ మి కంపెనీ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇటీవల లాంచ్ చేసిన రియల్ మి 6 సిరీస్ ఫోన్ల థరల్ని భారీగా తగ్గించింది. రియల్ మి 6 సిరీస్ ధరలు, ఫీచర్లు ఇవే..
ప్రతిరోజూ ఒక్కొక్క కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. మార్కెట్లో పోటీని తట్టుకోవడం కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి కంపెనీలు. ఇందులో భాగంగానే రియల్ మి కంపెనీ ( Realme company ) తన స్మార్ట్‌ఫోన్ ధరల్ని భారీగా తగ్గించింది. అది కూడా ఇదే ఏడాది ప్రవేశపెట్టిన 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ( Realme 6 series smartphones ) ధరల్లో ఈ తగ్గింపు ప్రకటించింది.
రియల్ మి 6 సిరీస్‌లో మీడియా టెక్ హీలీయో ప్రొసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నాలుగు కెమేరాలు అదనపు ఆకర్షణ. మెయిన్ కెమేరా సామర్ధ్యం 64 మెగా పిక్సెల్. ఈ ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యముంది. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జిబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 12 వేల 999 రూపాయలకు తగ్గగా..ఇందులోనే 8 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 14 వేల 999 రూపాయలకు తగ్గిపోయింది. కోమెట్ బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. Also read: Funny Shoplifting: దొంగతనానికి వచ్చి షాపును కాపాడారు
రియల్ మి 6 ఫీచర్లు ఇవే..
6.5 ఇంచెస్ ఫుల్ హెచ్ డి ( Full HD with 6.5 inch display ) తో పాటు అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతం ఉండగా..కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3డీ ప్రొటెక్షన్ అదనంగా అందిస్తోంది.
గేమింగ్‌కు ఉపయోగపడేలా మీడియా టెక్ హీలియో జి 90 టి ప్రోసెసర్ అమర్చారు. వెనుక వైపున్న నాలుగు కెమేరాల్లో మెయిన్ కెమేరా 64 మెగా పిక్సెల్ సామర్ధ్యం కలిగిన శాంసంగ్ జి డబ్ల్యూ1 సెన్సార్ ఉంటుంది. ఇది కాకుండా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 2 మెగా పిక్సెల్ టెర్రిటరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ క్వార్టియరీ సెన్సార్‌లు ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమేరాను అమర్చారు.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం ( Battery capacity ) కూడా ఎక్కువే. 4 వేల 3 వందల ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్ ( Android 10 version ) తో రియల్ మి ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పని చేస్తుంది. ఫోన్ బరువు 191 గ్రాములు కాగా ఇంకా అదనంగా చాలా ఫీచర్లు కలిగి ఉంది ఈ ఫోన్. Also read: WhatsApp Pay: వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు