Retired army officer had a heart attack during dance in madhya pradesh: ఒకప్పుడు హర్ట్ స్ట్రోక్ లు కేవలం మధ్య వయస్సులు, పెద్దవారిలో ఎక్కువగా కన్పించేది. కానీ ఇప్పుడు వయసుతో బేధం లేకుండా అందరు హర్ట్ స్ట్రోక్ కు గురౌతున్నారు. ఇదిలా ఉండగా..ఈ మధ్యకాలంలో చాలా మంది డ్యాన్స్ లు చేస్తు గుండెపోటుకు గురౌతున్నారు. అప్పటి వరకు ఎంతో జోష్ తో డ్యాన్సులు చేస్తున్నారు. ఏమైతుందో ఏమో కానీ.. ఒక్కసారిగా కుప్పకూలీపోయి చనిపోతున్నారు. ఈ ఘటనల్లో చిన్న, పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా అందరు ఉంటున్నారు. ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పూర్తి వివరాలు..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యోగా క్యాంపు కార్యక్రమంలో..  రిటైర్డ్‌ ఆర్మీ అధికారి పాల్గొన్నారు. ఆయన అక్కడున్న వారికి యోగా ఎలా చేయాలో నేర్పించారు. అంతటితో ఆగకుండా భారత దేశం గొప్పతనాన్ని గురించి కూడా వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన దేశభక్తి మీద పాటలు పాడారు. స్టేజీమీద డ్యాన్స్ లు కూడా చేస్తున్నారు. కానీ ఏంజరిగిందో కానీ ఒక్కసారిగా ఆయన కుప్పకూలీ పడిపోయారు. అక్కడున్న వారంతా స్టేజీ మీద ఆయన ఏదో డ్యాన్స్ లో భాగంగానే పడిపోయారేమో అనుకున్నారు. కానీ ఎంత సేపటికి కూడా ఆయన లేవలేదు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు ఆయనను లేపడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఆస్తా యోగా క్రాంతి అభియాన్ అనే సంస్థ ఉచితంగా మెగా యోగా క్యాంపు కార్యక్రమం చేపట్టింది. దీనికి రిటైర్డ్ ఆర్మీ అధికారి బల్విందర్ సింగ్ ఛబ్రాను ఇన్ వైట్ చేశారు. ఆయన వేదిక మీదకు వచ్చి యోగాపై అనేక అంశాలను వివరించారు. అంతేకాకుండా.. దేశం గురించి కూడా గొప్పగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో.. ఆయన స్టేజీ మీద మా తుజే సలాం అనే పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఒక చేతిలో జాతీయ జెండాను పట్టుకున్నారు. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్నారు.


Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?


అక్కడున్న వారంతా.. ఆర్మీ జవాన్ ను చప్పట్లు కొడుతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో ఆయన కిందపడిపోయారు. ఆయన డ్యాన్స్ లో భాగంగానే కిందపడిపోయారని అందరు అనుకున్నారు.  ఎంత సేపటికి లేవకపోయేసరికి, ఆయనను లేపడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఉలుకు పలుకు లేదు.  వెంటనే ఆయనను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బల్విందర్ సింగ్ గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే 2008లో బల్విందర్‌ సింగ్ బైపాస్ సర్జరీ చేసుకున్నట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter