వరి రైతుల కోసం ఈ యాప్ ప్రత్యేకం
రైస్ ఎక్స్‌పర్ట్ (riceXpert) పేరుతో గూగుల్ ప్లేస్టోరులో లభ్యమయ్యే ఈ యాప్ ఆధునిక వ్యవసాయ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి పనికొస్తుంది.
ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి వరి పంట వేయాలి? చీడపీడలు, కలుపు నివారణ సమస్యలకు పరిష్కారం ఎలా పొందాలి? మొదలైన విషయాల్లో రైతులకు అవగాహన పెంచేందుకు మరియు వారితో అనుసంధానమై సమస్యలు తెలుసుకొనేందుకు కటక్‌లోని జాతీయ వరి పరిశోధనా సంస్థ ఒక యాప్ కనిపెట్టింది. ఆ యాప్ పేరే "రైస్ ఎక్స్‌పర్ట్". మరి ఆ యాప్ ఉపయోగాలేమిటో మనమూ తెలుసుకుందాం..!
- రైస్ ఎక్స్‌పర్ట్ (riceXpert) పేరుతో గూగుల్ ప్లేస్టోరులో లభ్యమయ్యే ఈ యాప్ ఆధునిక వ్యవసాయ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి పనికొస్తుంది.
- ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ కోసం ప్రస్తుతం ఈ యాప్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.
- ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక వరి పంటకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా వాయిస్ రికార్డింగ్ చేసి లేదా వీడియో తీసి, ఈ యాప్ ద్వారా రైతులు నిపుణులకు పంపించవచ్చు.
- అలాగే సమస్యపై నిపుణులకు అవగాహన వచ్చేందుకు సంబంధిత ఫోటోలు కూడా యాప్‌లో జోడించవచ్చు.
- తమకు చేరిన ఫోటోలు, వాయిస్ క్లిప్‌లు, వీడియోల ఆధారంగా సంబంధిత రైతులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారాలు అందివ్వడానికి ప్రయత్నిస్తారు నిపుణులు
- పంటకు సంబంధించి ఎలాంటి ఎరువులు, విత్తనాలు వాడాలి? ఎలాంటి పనిముట్లు ఉపయోగించాలి? అవి ఎక్కడ దొరుకుతాయి? మొదలైన వివరాలన్నీ కూడా ఈ యాప్‌లో లభిస్తాయి.
- అలాగే ఈ యాప్‌లో ప్రశ్నను టైపు చూసి మెసేజ్ రూపంలో కూడా నిఫుణులకు పంపించే అవకాశం ఉంది
- రైతులు, పరిశోధకులు, వ్యవసాయ విద్యార్థులు ఎవరైనా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.