Scientists temporarily attached a pig's kidney to a human body and watched it begin to work: వైద్య రంగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు సైంటిస్ట్‌లు ఇటీవల పంది కిడ్నీని మనిషి శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్‌ (Operation‌) విజయవంతమైంది. మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుందని సైంటిస్ట్‌లు (Scientists) తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత పరిస్థితుల్లో అవయవమార్పిడి సర్వ సాధారణంగా మారింది. అయితే అవయవాల కొరత (Organ shortage) ఎక్కువగా ఉంది. ఇందుకు పరిష్కారం కనుగొనే విధంగా సైంటిస్ట్‌లు ప్రయత్నిస్తున్నారు. చాలా రకాల ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను (Organs of animals) మనషులకు అమర్చే విషయంలో చాలా రోజులుగా పరిశోధనలు సాగిస్తున్నారు. 


Also Read : Aryan Khan's bail plea: ఆర్యన్ ఖాన్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్న Mumbai Court


న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌ సెంటర్‌కు (NYU Langone Health center in New York) చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగికి పంది కిడ్నీ అమర్చే ప్రయోగం చేశారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా ఒప్పుకోవడంతో ఆపరేషన్‌ నిర్వహించారు. అలా పంది కిడ్నీని మనిషి శరీరానికి అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ (kidney) సాధారణంగానే పనిచేసిందని సర్జన్‌ డాక్టర్ రాబర్డ్‌ మోంట్గోమెరి తెలిపారు.  రోగనిరోధక వ్యవస్థపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదన్నారు. 


Also Read : Artificial Kidney: త్వరలో మార్కెట్‌లో కృత్రిమ కిడ్నీ, ఎలా పనిచేస్తుందో తెలుసా


ఈ ప్రయోగం విజయవంతమైందని, అవయవ మార్పిడిలో కీలకమైన ముందడుగని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అయితే వాస్తవానికి జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే అంశంపై 17వ శతాబ్దం (17th century) నుంచే ప్రయోగాలు మొదలయ్యాయి. ఇక 20వ శతాబ్దంలో(20th century) కొందరు శాస్త్రవేత్తలు బబూన్‌ (ఒకరకమైన కొండముచ్చు) గుండెను ఒక చిన్నారికి అమర్చి 21 రోజుల పాటు జీవించేలా చేశారు. అయితే ఇలాంటి ప్రయోగాలు (Experiments) విజయవంతమైతే.. అవయవాల కొరత ఉన్న ప్రస్తుత సమయంలో తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు జంతువుల అవయవాలను అమర్చి మనుషుల ప్రాణాలు బతికించొచ్చని శాస్త్రవేత్తలు (Scientists) అంటున్నారు.


Also Read : Avinash Wedding: పెళ్లి చేసుకున్న అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి