Artificial Kidney: త్వరలో మార్కెట్‌లో కృత్రిమ కిడ్నీ, ఎలా పనిచేస్తుందో తెలుసా

Artificial Kidney: అధునిక జీవనశైలిలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మూత్ర పిండాలకు సంబంధించినది. సమస్య తీవ్రమైతే క్లిష్టమైన డయాలసిస్ ప్రక్రియ తప్పనిసరిగా మారింది. అయితే త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2021, 09:40 AM IST
  • త్వరలో డయాలసిస్ ప్రక్రియకు చెక్ అంటున్న కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు
  • వైద్యరంగంలో సరికొత్త ఆవిష్కరణకు ప్రయత్నాలు
  • త్వరలో అందుబాటులో రానున్న కృత్రిమ కిడ్నీ
Artificial Kidney: త్వరలో మార్కెట్‌లో కృత్రిమ కిడ్నీ, ఎలా పనిచేస్తుందో తెలుసా

Artificial Kidney: అధునిక జీవనశైలిలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మూత్ర పిండాలకు సంబంధించినది. సమస్య తీవ్రమైతే క్లిష్టమైన డయాలసిస్ ప్రక్రియ తప్పనిసరిగా మారింది. అయితే త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు.

ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రధానమైంది మూత్రపిండాల సమస్య. మూత్రపిండాలు(Kidney)సరిగా పనిచేయనప్పుడు కృత్రిమ పద్ధతుల్లో శరీరంలోని మలినాల్ని తొలగించుకోవల్సిందే. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఖరీదైందే కాకుండా క్లిష్టమైంది కూడా. బీపీ నార్మల్‌గా లేకపేతే డయాలసిస్(Dialysis) ప్రక్రియ నిలిచిపోతుంది. ఈ క్రమంలో త్వరలో డయాలసిస్ ప్రక్రియకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ కిడ్నీలు త్వరలో అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే సిలికాన్ ఫిల్టర్‌తోపాటు సజీవమైన రీనల్ కణాలతో కూడిన హైబ్రిడ్ కిడ్నీ నమూనా సిద్ధమైంది. తొలిదశ ప్రయోగాలు విజయవంతం కావడం గమనార్హం. కిడ్నీ వ్యవస్థకు అనుసంధానించి..శరీరంలోనే ఉంచగలిగిన తక్కువ పరిమాణంలోని హైబ్రిడ్ కిడ్నీ ఇది. శరీరంలో ఓసారి అమర్చుకుంటే చాలు ఏ విధమైన బ్యాటరీ అవసరం లేకుండా రక్తం ప్రవహించే ఒత్తిడితోనే శరీరంలోని మలినాల్ని తొలగించుకోవచ్చు. దీనికి ఇక ఏ ఇతర మందులు తీసుకోవల్సిన అవసరం కూడా లేదు.

కృత్రిమ కిడ్నీ ఎలా పనిచేస్తుంది ( How Artificial kidney works)

కాలిఫోర్నియా యూనివర్శిటీ(California University) ద కిడ్నీ ప్రాజెక్టు పేరుతో అరచేతిలో ఇమిడే చిన్న సైజు యంత్రం తయారైంది. కంప్యూటర్ చిప్ తయారీలో ఉపయోగించే సిలికాన్ సహాయంతో అతి సూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను అభివృద్ధి చేశారు. పలుచని ఈ సిలికాన్ ఫిల్టర్ పొరలు ఓ వైపు, రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాల్ని నియంత్రించే రీనల్ ట్యూబుల్ సెల్స్ ఉన్న బయో రియాక్టర్ మరోవైపు ఉంటాయి. మనిషి రోగ నిరోధక వ్యవస్థ..ఈ కణాలపై దాడిచేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లుంటాయి. శరీరంలోని రెండు ప్రధాన ధమనుల్ని హైబ్రిడ్ మూత్రపిండాలన్ని అనుసంధానిస్తారు.క్లీన్ చేయాల్సిన రక్తం ఓ ట్యూబ్ ద్వారా ఇందులో ప్రవేశిస్తుది. క్లీన్ అయిన తరువాత ఇంకో ధమని ద్వారా శరీరంలో చేరుకుంది. వ్యర్ధాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లిస్తుంది. తదుపరి పరీక్షలన్నీ పూర్తయితే త్వరలో ఈ హైబ్రిడ్ లేదా కృత్రిమ కిడ్నీని (Artificial kidney)అందుబాటులో తీసుకురానున్నాయి. అదే జరిగితే వైద్యరంగంలో సరికొత్త నాంది కానుంది.

Also read: Oil Purify Test: మీరు వాడే వంట నూనె నిజంగా స్వచ్చమైనదా..? ఇలా తెలుసుకోండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News