Viral News: ఇలాంటి కరెన్సీ నోట్, నాణెం మీ వద్ద ఉంటే లక్షల రూపాయలు పొందే ఛాన్స్.. ఎలాగో తెలుసుకోండి..
Bank Note Serial Numbers: కొన్ని అరుదైన, పాత కరెన్సీ నోట్లు, నాణేలకు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. వాటిని విక్రయించడం ద్వారా లక్షల రూపాయలు పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.
Old Currency Note With 786 Serial Number: ముస్లింలు 786 అనే సీరియల్ నంబర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. అరబిక్‌లో 'బిస్మిల్లా అల్-రెహమాన్ అల్-రహీమ్' అనే పదానికి ఇది న్యూమరాలజీ నంబర్. ముస్లింలు దీన్ని కేవలం సెంటిమెంట్‌గానే కాదు లక్కీ నంబర్‌గా భావిస్తారు. అలాగే కొంతమంది హిందువులు మాతా వైష్ణోదేవి చిత్రాన్ని ముద్రించిన నాణేలను అదృష్టంగా భావిస్తారు. అందుకే 786 నంబర్‌తో కూడిన కరెన్సీ నోట్లకు, మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన నాణేలకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. వీటి కోసం లక్షల రూపాయలు వెచ్చించేందుకు కూడా కొందరు వెనుకాడట్లేదు.
మీవద్ద 786 నంబర్ కరెన్సీ నోట్ ఉందా?
మీవద్ద 786 నంబర్‌తో కూడిన కరెన్సీ నోటు ఉంటే eBay వెబ్‌సైట్‌లో దాన్ని అమ్మకానికి పెట్టవచ్చు. ఇలాంటి కరెన్సీ నోట్లకు రూ.3 లక్షల వరకు డిమాండ్ ఉంది. eBayలో ఇలాంటి అరుదైన నోట్లను కొనుగోలు చేసేందుకు కొంతమంది భారీ మొత్తంలో వెచ్చిస్తున్నారు. కాబట్టి మీవద్ద ఈ నోటు ఉన్నట్లయితే ఈబేలో విక్రయించి భారీగా డబ్బు పొందవచ్చు.
Ebay.comలో పాత కరెన్సీ నోట్లను ఎలా విక్రయించాలి
స్టెప్ 1: www.ebay.com ఓపెన్ చేయండి
స్టెప్ 2: హోమ్‌పేజీలో రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.
స్టెప్ 3: రిజిస్టర్ అయ్యాక మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి.
స్టెప్ 4 : మీవద్ద ఉన్న కరెన్సీ నోటును ఫోటో తీసి ఈబేలో అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 4: నోట్‌ని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు మీ ప్రకటనను చూసి మిమ్మల్ని సంప్రదిస్తారు.
మాతా వైష్ణో దేవి నాణేనికి ఫుల్ డిమాండ్ :
కాయిన్ బజార్ అనే వెబ్‌సైట్‌లోనూ పాత, అరుదైన కరెన్సీ నోట్లను విక్రయిస్తారు. పాత రూ.1, రూ.2, రూ.5 నోట్లు కొన్ని షరతులతో లక్షల రూపాయాలకు ఇక్కడ విక్రయించబడుతాయి. కొన్ని కథనాల ప్రకారం.. మీ వద్ద మాతా వైష్ణో దేవి చిత్రంతో కూడిన రూ.5, రూ. 10 నాణేలు ఉంటే మీరు వాటిని వేలానికి పెట్టి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ నాణేలను ప్రభుత్వం 2002లో విడుదల చేసింది, వీటికిప్పుడు చాలా డిమాండ్ ఉంది. మాతా వైష్ణో దేవి అంటే హిందువులకు చాలా గౌరవం ఉంది కాబట్టి, అలాంటి నాణెం కోసం లక్షలు ఖర్చు చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
ఒక్క రూపాయి నోటుకు వేల రూపాయలు :
కొన్ని కథనాల ప్రకారం.. పాత రూపాయి నోటుకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. మీవద్ద ఉన్న రూ.1 నోటు వారి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే.. మీకు రూ.45 వేలు వరకు పొందవచ్చు. ఆ ప్రమాణాలు ఏంటంటే.. అది 1977-1979 నాటి పాత రూపాయి నోటు అయి ఉండాలి. దానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ హిరూభాయ్ ఎం పటేల్ సంతకం ఉండాలి.
Also Read: Online Tickets: జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకంపై హైకోర్టు స్టే
Also Read: Two-Headed Snake: అత్యంత అరుదైన రెండు తలల పాము.. గతంలో ఎప్పుడూ చూసుండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.