Rare Two-Headed Snake Found in South Africa Forest: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫొటోస్, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతులకు సంబంధించి వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, జింక, మొసలి, ఏనుగు, పాములకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ జనాలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని భయందోళనకు గురిచేసే విధంగా ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోస్ ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. అత్యంత అరుదైన రెండు తలల పాము భయందోళనకు గురిచేస్తోంది.
అత్యంత అరుదైన రెండు తలల పాము దక్షిణాఫ్రికాలోని అడవిలో కనబడింది. ఈ పాము మనం సాధారణంగా చూసే రెండు తలల పాము లాంటిది కాదు. మాములుగా రెండు తలల పాముకు.. రెండు చివరలా తలలు ఉంటాయి. కానీ ఈ పాముకు మాత్రం ఒకే సైడ్ రెండు తలలు ఉండటం విశేషం. ఇది రెండు తలలు ఉన్న అరుదైన జాతికి చెందిందని తెలుస్తోంది. ఈ పాము హానిచేయని జాతికి చెందినదట. ఇది పక్షి గుడ్లను మాత్రమే తింటాయట.
స్నేక్ రక్షకుడు నిక్ ఎవాన్స్ రెండు తలల పాముకు సంబందించిన పోటోలను తన ఫేస్‌బుక్‌లో పంచుకున్నాడు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోస్ చుసిన అందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఇలాంటి రెండు తలల పామును ఎప్పుడూ చూడలేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అత్యంత అరుదైన రెండు తలల పాము' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
'ఈ పామును చూడటం చాలా వింతగా అనిపించింది. ఇది చాలా పొడవుగా ఉంది. ఈ పాము కదిలికలు చూడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిసార్లు రెండు తలలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. మరికొన్నిసార్లు తలలు ఒకదానిపై మరొకటి ఉంటుంది. ఇలాంటి పాము ఎక్కువ కాలం జీవించదు. ఇది ఎటు వెళ్లినా చాలా నెమ్మదిగా కదులుతుంది. ఇంత కాలం జీవించి ఉందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది పక్షి గుడ్లను మాత్రమే తింటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ తలలతో జన్మించిన జంతువులకు పాలిసెఫాలీ అనే పరిస్థితి ఉంటుంది' అని నిక్ ఎవాన్స్ తన పోస్టులో పేర్కొన్నాడు.
Also Read: S TET Results 2022: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల.. అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Two-Headed Snake: అత్యంత అరుదైన రెండు తలల పాము.. గతంలో ఎప్పుడూ చూసుండరు!
అత్యంత అరుదైన రెండు తలల పాము
గతంలో ఎప్పుడూ చూసుండరు
పక్షి గుడ్లను మాత్రమే తింటాయి