Sheep attacks beautiful Young Woman after teased: ఈ భూ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. అందులో కొన్ని క్రూర జంతువులు ఉండగా.. మరికొన్ని సాదు జంతువులు ఉంటాయి. పులి, సింహం, ఎలుగుబంటి, ఏనుగు లాంటి క్రూర జంతువులను చూస్తే భయం కలగక మానదు. అందుకే వాటి జోలికి మనం వెళ్లం. ఆవు, గేదె, కుక్క, పిల్లి, మేక, గొర్రె లాంటివి సున్నితమైనవి. వీటితో మనం సరదాగా ఆదుకుంటాం. అయితే వీటిని కూడా ఎలాంటి కారణం లేకుండా గెలికితే తమ విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తాయి. దాడి కూడా చేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతోన్న వీడియోలో ఇద్దరు యువతులు అడవికి వెళ్లి గొర్రెలు ఉండే ప్రదేశానికి వెళతారు. ఓ గొర్రె ఇటీవల చిన్ని గొర్రెకు జన్మనిస్తుంది. ఆ చిన్ని గొర్రెను ఓ యువతి ఎత్తకుని ఆడుకుంటుంది. తన బిడ్డను ఎత్తుకెళుందని గొర్రె ఆమెను బెదరించబోయింది. ఇంతలో యువతి థన్ ఆకలితో గొర్రెను బెదిరిస్తుంది. దాంతో చిర్రెత్తిపోయిన ఆ గొర్రె.. యువతి బ్యాక్‌ను గుద్దేస్తుంది. దాంతో ఆ యువతి అక్కడికక్కడే కిందపడగా.. గొర్రె పిల్ల కూడా ఆమె చేతుల్లోంచి కిందపడుతుంది. 



లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరోసారి యువతిపై గొర్రె దాడి చేస్తుంది. ఇంతలో పక్కనున్న మరో యువతి వచ్చి ఆమెను కాపాడవుతుంది. ఈ వీడియో 'బ్యూటీ.వైల్డ్ లైఫ్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటివరకు ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ రావడంతో పాటు నెటిజన్ల రియాక్షన్స్ బాగున్నాయి. 'గెలికితే ఊరుకుంటుందా మరి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బాగా అయింది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


Also Read: Google Trending Video: పాకిస్థాన్‌లో దారుణం.. ఒంటరి మహిళను చూసి, వెనకాల నుండి వచ్చి..!!


Also Read: East India Company: నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా.


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook