East India Company: ఓడలు బడులు..బడులు ఓడలౌతాయనేది పాత సామెత. అన్ని రోజులూ ఒకేలా ఉండనేది మరో సామెత. ఈ రెండు సామెతలూ నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీకు సరిగ్గా సరిపోతుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే మరి. లెట్స్ హ్యావ్ ఎ లుక్...

ఈస్ట్ ఇండియా కంపెనీ. పేరు చెబితేనే వణుకు పుట్టించే వ్యాపార సామ్రాజ్యమది. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యానికి పునాది వేసింది ఈ కంపెనీనే. ఈస్ట్ ఇండియా కంపెనీనే తొలుత ఇండియాలో అడుగు పెట్టింది. దాదాపు 2 వందల ఏళ్లు ఇండియాను పాలించించి ఈ కంపెనీనే. 16 వందల శతాబ్దం చివరిలో ప్రవేశించి..నెమ్మది నెమ్మదిగా మొత్తం దేశంపై ఆధిపత్యం చెలాయిస్తూ..పాలనను బ్రిటీషు ప్రభుత్వానికి అప్పగించింది. 

టీ, కాఫీలు అమ్ముతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ

ఆంగ్లేయులు ఇండియాలో స్థాపించిన తొలి కంపెనీ ఇది. ప్రారంభంలో ఈ కంపెనీ వ్యవసాయం నుంచి మైనింగ్, రైల్వే వరకూ అన్ని పనుల్లో ఉండేది. అలా వ్యాపార విస్తరణ కోసం ఇండియాకు వచ్చి..దేశాన్నే పాలించే స్థితికి చేరింది. మరి ఇప్పుడా కంపెనీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలనుందా..యాధృఛ్చికమో మరేదో కానీ నాటి ఘనమైన ఈస్ట్ ఇండియా కంపెనీని భారతీయ మూలాలున్న వ్యాపారవేత్త సంజీవ్ మెహతా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తరువాత కంపెనీని ఈ కామర్స్ వేదికగా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీ టీ, కాఫీ, చాకొలేట్ వంటి వస్తువుల్ని ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తోంది. 

క్రీస్తుశకం 16 వందల శతాబ్దం చివర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానప జరిగింది. అప్పటి ఇంగ్లండ్ మహారాణి ఎలిజబెత్ 1..ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మెర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ ఈస్ట్ ఇండీస్‌కు అనుమతించింది. ఫలితంగా ఈ కంపెనీకు తూర్పు ద్వీప సమూహంలోని దేశాల్లో వ్యాపారం కోసం పూర్తి అధికారాలు అప్పగించారు. మసాలా వ్యాపారం కోసం అప్పట్లో ఈ కంపెనీ స్థాపించారు. అప్పట్లో స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పూర్తి అధికారాలుండేవి. 

ఇండియాపై 2 వందల ఏళ్లు  అధికారం

కొన్నేళ్ల తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ కపాస్, రేషమ్, టీ, నీలం, మత్తు మందు వ్యాపారం కూడా ప్రారంభించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో వ్యాపారం, సూరత్‌లో ఫ్యాక్టరీ తెర్చుకునేందుకు జహంగీర్ నుంచి అనుమతి తీసుకుంది. క్రమంగా మొత్తం దేశాన్ని ఆధీనంలో తీసుకుని..2 వందల ఏళ్లు పాలించింది. 1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం ఇంగ్లండ్ ప్రభుత్వం 1874 జనవరి 1వ తేదీన కంపెనీని వెనక్కి పిలిపించి సొంతంగా అధికార పగ్గాలు తీసుకుంది. నాడు ఇండియాలో దురాక్రమణ రీతిలో కంపెనీ వైఖరి ఉండేది. భారతీయులపై దౌర్జన్యాలకు పాల్పడేది. 2003లో ఈ కంపెనీని షేర్స్ గ్రూప్ ఒకటి కొనుగోలు చేసి..టీ, కాఫీ వ్యాపారం ప్రారంభించింది. 

ఆ తరువాత 2005లో భారతీయ మూలాలు కలిగిన బ్రిటీషు వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఈ కంపెనీ చేజిక్కించుకున్నారు. లగ్జరీ టీ, కాఫీ, ఇతర పదార్ధాల విక్రయంలో కొత్త బ్రాండ్ సృష్టించి వ్యాపారం విస్తరించారు. ఏ కంపెనీ అయితే నాడు మొత్తం దేశాన్ని ఆక్రమించి పాలించిందో అదే కంపెనీకు యజమాని కావడం ఓ భారతీయుడిగా గర్వంగా ఉందంటున్నారు సంజీవ్ మెహతా.

Also read: Cash Deposit Rules: నగదు లావాదేవీలు, డిపాజిట్లపై కొత్త నిబంధనలు, ఏడాదిలో 20 లక్షలు దాటితే ఏమౌతుంది

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

English Title: 
East india company company history now and than, once ruled india for 200 years now selling tea and coffee
News Source: 
Home Title: 

East India Company: నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా.

East India Company: నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా..ఏం చేస్తుందో తెలుసా
Caption: 
East india company ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
East India Company: నాడు దేశాన్ని పాలించిన ఆ కంపెనీ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా.
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 19, 2022 - 16:43
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
131
Is Breaking News: 
No

Trending News