Cow Attack Video: ఆ ఆవు పగబట్టిందా, స్కూలుకు వెళ్తున్న చిన్నారిపై భయంకర దాడి
Cow Attack Video: ఎంతవరకూ నిజమో కాదో తెలియదు కానీ..పాములు పగబట్టడం గురించి వింటుంటాం. కానీ ఇక్కడ నిజ జీవితంలో ఓ ఆవు పగబట్టిందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అది కూడా అభంం శుభం తెలియని ఓ చిన్నారిపై. పూర్తి వివరాలు మీ కోసం...
Cow Attack Video: చెన్నై వీధుల్లో జరిగిన ఈ ఘటన ఒళ్లు జలదరింపజేస్తోంది. హృదయం తరుక్కుపోతోంది. అచ్చం పగబట్టినట్టుగా ఓ ఆవు..ఆ చిన్నారిని విచక్షణా రహితంగా కుళ్లబొడిచేసింది. కొమ్ములతో గిరాటేసి కింద పడేసి విధ్వంసం సృష్టించింది. అక్కడున్న సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం ఇప్పుడు వైర్ల అవుతోంది. అసలేం జరిగిందంటే..
చెన్నైలోని ఓ వీధిలోంచి తల్లితో కలిసి ఓ చిన్నారి స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ ఇద్దరి కంటే ముందు రెండు ఆవులు వెళ్తున్నాయి. ఏమైందో తెలియదు..ఒక్కసారిగా అందులో ఓ ఆవు వెనక్కి తిరిగి ఆ చిన్నారిపై దాడి చేసింది. అది కూడా మామూలు దాడి కాదు. ఏదో ఆ పాపపై పగబట్టినట్టుగా దాడి చేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కొమ్ములతో ఎత్తిపడేసి కాళ్లతో , కొమ్ములతో తొక్కేసింది. ఆ తల్లి ఒంటరిగా నిస్సహాయురాలై చూస్తుండిపోయింది. అక్కడున్న స్థానికులు రాళ్లతో ఆవుల్ని విదిలించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మద్యలో ఓ వ్యక్తి ఆ చిన్నారిని కాళ్లతో ఇవతలకు లాగినా..మళ్లీ వచ్చి దాడి చేసింది. పాపం ఆ చిన్నారి పగబట్టినట్టుగా జరిపిన ఆవు దాడిలో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా నలిగిపోయింది. ఇంకాస్సేపు ఈ దాడి జరిగుంటే ఆ చిన్నారి ప్రాణాలు కూడా పోయేవి. ఇంతలో ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో అప్పటికి గానీ ఆవు పారిపోలేదు.
ఓ వైపు ఆవు ఆ చిన్నారిపై దాడి చేస్తుండగానే మరో రెండు ఆవులు అక్కడికి వచ్చి చూస్తూ ఉండిపోవడం వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఆ చిన్నారిని రక్షించేందుకు చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసినా అక్కడి ఓ ఇంట్లో ఆరు బయట ఉన్న ఓ వ్యక్తి మాత్రం చోద్యం చూస్తుండిపోయాడు.
Also read: Independence Day 2023 Long Weekend: అన్నీ మర్చిపోయి సరదాగా తిరిగొద్దాం రండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook