Disturbing Video: పాఠశాల పిల్లలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. తోటి విద్యార్థినిపై మిగతా విద్యార్థులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కిందపడేసి తన్నుతూ బాలికపై తీవ్రంగా దాడి చేశారు. వీధి రౌడీల్లా ప్రవర్తించి ఓ బాలికను చితకబాదారు. అత్యంత అమానుషంగా వ్యవహరించిన ఆ దృశ్యాలు చూస్తుంటే భయానకంగా ఉన్నాయి. అంతేకాకుండా బండ బూతులతో నోటికి కూడా పని చెప్పారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Naa Anveshana: యూట్యూబ్‌తో కోట్లకు కోట్లు.. నా అన్వేషణ యూట్యూబర్‌ సంపాదన తెలిస్తే షాకవుతారు


ఆగస్టు 12వ తేదీ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రకారం క్లిప్‌లో కనిపించిన మైనర్‌లందరూ ఒకే పాఠశాల విద్యార్థులు. వారంతా స్నేహితులే. అయితే తనతో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఓ విద్యార్థి తన తోటి వారితో కలిసి ఆ బాలికపై దాడికి పాల్పడింది. పిడిగుద్దులతో విరుచుకుపడుతూ.. తన్నుతూ బీభత్సం సృష్టించారు. ఆ గొడవను అడ్డుకునేందుకు ముగ్గురు అబ్బాయిలు ప్రయత్నించారు. కానీ వారిని నెట్టేసి మరి ఆ విద్యార్థినులు దాడికి పాల్పడ్డారు. వెంట్రుకలు పీకుతూ కిరాతకంగా వ్యవహరించారు. మురుగు నీటిలో బాలికను పడేసేందుకు ప్రయత్నించారు.


Also Read: Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడి


అక్కడ ఉన్న అబ్బాయిలు బలవంతంగా విడిపించడంతో బాలిక తప్పించుకుని వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత వెంటనే మళ్లీ బాలికను తీవ్రంగా కొట్టారు. మళ్లీ కిందపడేసి చితకబాదారు. అనంతరం అబ్బాయిలు మళ్లీ వెళ్లి విడిపించడంతో ఆ బాలిక తప్పించుకుని వెళ్లిపోయింది. అయితే వెళ్లిపోతున్న బాలికను మళ్లీ పిలిచి దాడి చేసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఈ గొడవ పాఠశాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. 


ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే స్పందించిన పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మైనర్లు కావడంతో వారి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలికల ప్రవర్తనపై పాఠశాల యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా పిల్లలు ఇలా తయారైతే ఎలా? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆడుకునే సమయంలో ఇలాంటి గొడవలు దిగే విద్యార్థులు భవిష్యత్‌లో ఎలా తయారవుతారని ముక్కు మీద వేలేసుకుంటున్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter