Side Effects of Maggi: మ్యాగీ.. మ్యాగీ.. మ్యాగీ.. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోనే కాదు.. పొద్దంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చే భార్యాభర్తలు కూడా ఓపిక లేనప్పుడు 2 నిమిషాల్లో చిటుక్కున తయారయ్యే వంటకం కోసం మ్యాగీనే ఇష్టపడతారు. ఇది కొందరికి ఇష్టమైన, రుచికరమైన వంటకం అయితే.. ఇంకొందరికి సమయం, ఓపిక రెండూ లేనప్పుడు టక్కున గుర్తుకొచ్చే వంటకంగా పేరుంది. అఫ్‌కోర్స్.. అసలు వంటలే చేయడం రాక కేవలం మ్యాగీని మాత్రమే చేసుకుని తినే వాళ్లు కూడా ఉంటారు అది వేరే విషయం లెండి. ఏదేమైనా తెలియకుండానే మ్యాగీ చాలామందికి ఒక నిత్యావసర వస్తువులా మారింది. నెల వారీ సరుకులు కొనుగోలు చేసే కుటుంబాల కిరాణ వస్తువుల జాబితాలో మ్యాగీ ఎప్పుడో ఒక భాగమైపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దల సంగతి ఎలా ఉన్నా.. చిన్న పిల్లలు మాత్రం మ్యాగీని అమితమైన ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు ఎక్కువ సమయం లేకుపోతే పేరెంట్స్‌కి వెంటనే గుర్తుకొచ్చే ఈజీ రెసిపి కూడా ఈ మ్యాగీనే. ఇలా ఏ రకంగా చూసినా మ్యాగీతో చిన్న పిల్లలకు విడదీయలేని అనుబంధం ఉంది. కానీ ఇంతకీ ఈ మ్యాగీని తింటే వచ్చే ఇబ్బంది ఏం లేదా ? ప్రత్యేకించి ఐదేళ్ల వయస్సులోపు చిన్నారులకు మ్యాగీ ఓకేనా అంటే కాదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఎందుకంటే మ్యాగీని తయారుచేసే పదార్థాలను దృష్టిలో పెట్టుకుని ఐదేళ్లలోపు పిల్లలపై సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. 


ఎసిడిటీ, కడుపునొప్పి
మ్యాగీలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఐదేళ్లలోపు చిన్న పిల్లలో ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా వారి కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.


గుండె జబ్బులు, డయాబెటిస్
మనిషి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంపొందించే ట్రాన్స్ ఫ్యాట్స్ మ్యాగీలో పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒకప్పుడు నడి వయస్సు దాటిన వారిలోనే కనిపించిన ఈ గుండె జబ్బులు, డయాబెటిస్ సమస్యలు ఇప్పుడు చిన్న వయస్సులోనే ఎటాక్ అవడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ తినడమే కారణం అని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైన విషయం తెలిసిందే.


హై బీపీ
మ్యాగీని రెగ్యులర్‌గా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అది క్రమక్రమంగా హైపర్ టెన్షన్ కిందకు మారే ప్రమాదం ఉంది. 


డేంజర్ ఎలిమెంట్స్
మ్యాగీ తయారీలో మైద పిండి, ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఎంత ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత ప్రమాదం.


ప్రాణాంతక జబ్బు
మ్యాగీలో 46 శాతం సోడియం మిలితమై ఉంటుంది. ఎక్కువ మోతాదులో సోడియం ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల హైపర్‌నెట్రేమియా వంటి ప్రాణాంతక జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది.


మానసిక, శారీరక లోపాలు
ఎదిగే పిల్లలకు న్యూట్రియెంట్స్ అధికంగా ఉండే పోషక ఆహారం అందించాలి. కానీ మ్యాగీ వంటి ఫుడ్స్‌లో ఎలాంటి న్యూట్రియెంట్స్ ఉండవు. కడుపు నిండా రెగ్యులర్‌గా అలాంటి ఫుడ్‌ని తిన్న తరువాత మరే ఇతర హెల్తీ ఫుడ్‌ని పిల్లలు తినలేరు. దాంతో వారి శరీరానికి అందాల్సిన న్యూట్రియెంట్స్ అందకపోవడం వల్ల వారిలో మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. అదే కానీ జరిగితే అది వారి జీవితానికే పెను శాపంగా మారుతుంది అనే విషయం మర్చిపోవద్దు. 
ఇది కూడా చదవండి : 
Rs 20 per day to Rs 100 Cr Business: ఒకప్పుడు రూ. 20 కూలీ.. ఇప్పుడు రూ. 100 కోట్ల వ్యాపారానికి యజమాని 
ఆ మాటకొస్తే.. ఒక్క మ్యాగీనే అని కాదు.. అన్నిరకాల నూడుల్స్ ఈ అనారోగ్య సమస్యలకు దారితీసేవే. వాటి తయారీ విధానం అందుకు ఒక కారణం కాగా, జంక్ ఫుడ్ తరహాలో వాటిని వండుకుని తినే విధానం మరో కారణంగా ఎక్స్ పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. అందుకే పిల్లలు మారాం చేసినా.. మొండికేసినా.. పెద్దలు మాత్రం విచక్షణతో వారికి అర్థమయ్యేలా చెప్పి మంచి హెల్తీ ఫుడ్‌నే అందించాలి అనే విషయం మర్చిపోవద్దు.


ఇది కూడా చదవండి : Railways Stations Names: అతి పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఇదే.. అలాగే అతి చిన్న పేరున్న స్టేషన్ కూడా ఇదిగో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK