Python snake viral video: సాధారణంగా ఎక్కడైన పాము కన్పిస్తే .. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైన భయపడిపోయి ఆ ప్రదేశాలకు అస్సలు పొరు. కొంత మంది మాత్రం పామంటే తమకేం అన్నవిధంగా ప్రవర్తిస్తుంటారు. పాములు కన్పిస్తే.. దైర్యంగా వాటిని పట్టే వారికి సమాచారం ఇస్తుంటారు. మరికొందరు ఇంకా ధైర్యం చేసి పాముల్ని పట్టుకుని మరీ ఫోటోలు,వీడియోలకు ఫోజులు ఇస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాములు వీడియోలకు నెట్టింట ఏ మాత్రం కొదువలేదని చెప్పుకొవచ్చు. ప్రతిరోజు పాముల వీడియోలు బోలేడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూసేందుకు పడిచస్తుంటారు. అదే విధంగా కొందరు పాముల్ని పట్టుకొవడం తమ జాబ్ గా పెట్టుకుంటారు .



 


వీరి ఇళ్లలో ఉన్న వారు సైతం.. పాముల్ని చూసి అస్సలు భయపడరు. చిన్న పిల్లలు కూడా పాములతో చెడుగుడులాడుతుంటారు. పాముల వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక బుడ్డొడు పాముతో ఆడుతున్న వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.



పూర్తి వివరాలు..


కొంత మంది ఇటీవల కుక్క, పిల్లి ఇతర జంతువులు మాదిరిగా కొండ చిలువల్ని సైతం ఇంట్లో పెంచుకుంటున్నారు. అంతే కాకుండా..తమ బెడ్ ల మీద .. హల్ లో ఎక్కడంటే అక్కడ వాటిని వదిలేస్తున్నారు. ఇటీవల చాలా వీడియోలలో కొండ చిలువలు ఇంట్లో వాళ్లతో కలిసి ఉంటున్నాయి. వారి బెడ్ ల మీద..సోఫాలలో కూడా అవి ఉంటున్నాయి. అయితే.. ఇక్కడోక బాలుడు.. కొండ చిలువతో ఆడుకుంటున్నాడు.


అదేమో.. భారీగా ఉంది. అతడేమో.. దాని తోక పట్టుకుని దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. దాని మీద అదేదో.. పరుపు అన్న విధంగా పడుకుంటున్నాడు. పాపం.. కోండ చిలువ.. మాత్రం తనమానాన తాను.. వెళ్లిపోతుంటే.. అతను మాత్రం దాన్ని వదలకుండా పట్టుకుని మరీ ర్యాగింగ్ చేస్తున్నాడు.


Read more: Viral Video: జగన్నాథుడి ముందు వంగి ప్రార్ధించిన కోడి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..


ఈవీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. అలా పాములు, కొండ చిలువ దగ్గర వదిలేస్తే..జరగరానిదిజరిగితే.. ఎలా అని టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter