COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Smallest Dangerous Snakes: ప్రపంచంలో ఎన్నో జాతులకు సంబంధించిన పాములు ఉంటాయి. ముఖ్యంగా అమెజాన్ లాంటి అడవి ప్రాంతాల్లో కొన్ని వేల జాతులకు సంబంధించిన పాములు ఇప్పటికీ నివసిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మన అందరికీ కొన్ని జాతులకు సంబంధించిన పాములు మాత్రమే తెలుసు. ముఖ్యంగా భారత్ లోనైతే ఎక్కువగా ఓ 10 జాతులకు సంబంధించిన పాములు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చాలావరకు కింగ్ కోబ్రాలతో పాటు బిగ్ ఫైథాన్సే చూసి ఉంటారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం అనేక జాతులకు సంబంధించిన పాములు ఉంటాయి. అమెజాన్ అడవుల్లో,  నైజీరియన్ అడవుల్లో వింత వింత జాతులకు సంబంధించిన స్నేక్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్రదేశాల్లో ప్రపంచంలో అతి చిన్న పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా ఈ పాముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?


టాప్ 3 అతి చిన్న పాములు:
బ్రెజిలియన్ బ్లాక్ స్నేక్:


ఈ పాము చూడడానికి ఎంతో చిన్నగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా వాటికి చిన్నచిన్న రెండు కళ్ళు కూడా ఉంటాయి. ఈ రెండు కళ్ళలో ఒక బ్లూ కలర్ లైట్ లాగా లెన్స్ కూడా ఉంటాయి. ఇవి కేవలం ఒక బొటన వేలు అంత మాత్రమే ఉంటాయి. అలాగే ఈ పాములన్ని చూడడానికి ఒకటే కలర్లో కనిపిస్తాయి. చిన్నగా నల్లని ఆకారం కలిగిన ఈ పాములు ఆహారం కోసం చిన్నచిన్న కీటకాలను చంపి తింటాయట. అలాగే ఈ పాములు కొన్ని సంవత్సరాల తర్వాత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇక పాము రూపం విషయానికొస్తే.. పాము పై చిన్నచిన్న పొరుచు ఆకారం ఉంటుంది. దీంతోపాటు తెలుపు రంగులో కొన్ని మచ్చలు కూడా కనిపిస్తాయి.


థ్రెడ్ స్నేక్: 
ఇవి చూడడానికి నకిలీ పాముల్లా కనిపిస్తాయి కానీ ఇవి నిజమైన పాములే.. ఈ పాముల పేర్లలోనే ఉంది త్రెడ్ అని.. ఇవి చూడడానికి ఎంతో సన్నంగా వానపాముల్లా ఉంటాయి.. కానీ చాలా డేంజర్ అని పరిశోధనల్లో వెళ్లడైంది. ఇవి మాత్రం విభిన్న కలర్లలో ఉంటాయి. ఇందులో కొన్ని ఎరుపు రంగులో కనిపిస్తే మరికొన్ని మాత్రం నలుపు రంగులో ఉంటాయి. అలాగే ఇవి చూడడానికి అచ్చం వాన పాములకు జన్మించే పిల్లల్లా ఉంటాయి. 


బేబీ పైథాన్స్: 
ఇవి ఎక్కువగా అమెజాన్ అడవుల్లో ఉంటాయి. మనం చాలా వీడియోలలో ఈ బేబీ పైథాన్స్ చూసి ఉంటాము. ఇవి చూడడానికి ఎంతో చిన్నవిగా ఉన్నప్పటికీ ఒక్క కాటుతో అన్నింటిని చంపెయ్యగలిగే శక్తిని ఉంటాయి. దీంతోపాటు వీటి పిల్లలు కూడా చిన్న ఆకారంలోనే జన్మిస్తాయి. అయితే ఇవి వయస్సు పెరిగే కొద్దీ ఆకారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ బేబీ పైథాన్స్ చూడడానికి పెద్ద పైథాన్స్ లాగే కనిపిస్తాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.