Viral Video: పాము ముంగీస మధ్య నడిరోడ్డుపై భీకర పోరు
పాము ముంగీస మధ్య నడిరోడ్డుపై సాగిన పోరు వాహనదారులను ముందుకు వెళ్లనివ్వలేదు . ఆ పోరును చూస్తున్న వాళ్లు వాటిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు.
ఈ 29 సెకన్ల వీడియోను ( Viral Video ) మైక్రోబ్లాగర్ సైట్ అయిన ట్విట్టర్ లో ఇండియన్ ఫారెస్ట్ ( IFS ) అధికారి డాక్టర్ అబ్దుల్ ఖయూం షేర్ చేశారు. ఈ పోస్ట్ చేసే సయయంలో ఆయన ఇలా రాశారు..." ఇదిప్రకృతిలో సహజం. పాము ముంగీస పోరును ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇది మంచి విషయం . ఎందుకంటే బలవంతుడే జయిస్తాడు అనే అంశమే ప్రకృతిని నడిపిస్తోంది ".
ఈ వీడియోను ( Trending Video ) ఆగస్టు18న షేర్ చేయగా ఇప్పటి వరకు 10,000 కన్నా ఎక్కువ సార్లు చూశారు. సోషల్ మీడియా ( Social Media ) లో దీన్ని తెగ షేర్ చేస్తున్నారు నెటిజెన్స్ ( Netizens ).
ఇందులో పాము ముంగీస తమ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇందులో ముంగీస పామును చంపడానికి ప్రయత్నిస్తోంటే పాము మాత్రం తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
అయితే రోడ్డుపై జరిగిన ఈ భీరక పోరును అక్కడ ఉన్న వాహనదారులు చూడటం తప్పా ఇంకేం చేయలేకపోయారు. కొంత మంది దీన్ని రికార్డు కూడా చేశారు. ఈ పోరులో ముంగీస గెలిచింది. పాము ఓడిపోయింది.