Very Rare Snake Egg Opening Viral Video Watch Now: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వింత జంతువులు, సరీసృపాలు (Reptiles) సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా వరకు భయంకరమైన పాములు ఉండడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి నెటిజన్స్‌ కూడా పాములకు సంబంధించిన వీడియోలు కూడా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని కారణంగా సోషల్ మీడియాలో ఎలాంటి పాములకు సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో రీచ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ వీడియోకు కూడా ఇలా రీచ్‌ వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాములు గుడ్లు పెట్టడం ఎవరైన చూసి ఉంటారా? పాములు నిజంగా గుడ్లు పెడతాయా? చాలా మంది పాములు నేరుగా పిల్లలకు జన్మనిస్తాయని అనుకుంటారు. కానీ కొన్ని పాములు పాములు గుడ్లు కూడా పెడుతూ ఉంటాయి. కొన్ని పాములు నేరుగా కాకుండా గుడ్ల ద్వారా కూడా పిల్లలకు జన్మనిస్తాయి. ఇలాంటి వీడియోలు గతంలో సోషల్ మీడియాలో చూసి ఉంటారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్స్‌ తెగ ఆశ్చర్యపోతున్నారు. పాములు పెట్టిన గుండ్ల నుంచి పిల్లలు ఇలా కూడా తీస్తారా? అన్ని షాక్‌ అవుతున్నారు.



ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు పాము గుడ్డు తీసుకుని..దానిని కత్తెరతో కట్‌ చేయడం మీరు గమనించవచ్చు.  ఇలా గుడ్డును రెండు ముక్కలుగా కట్‌ చేస్తాడు. అయితే అందులో మీకు చిన్న ప్రాణాలతో ఉన్న పాము కనిపించవచ్చు. అయితే ఈ వ్యక్తి పామును బయటికి లాగి చూస్తాడు. ఇంతలోనే ఆ పాము నేరుగా గుడ్డు లోపలి నుంచి పైకి రావడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ గుడ్డు చాలా ఫ్రెష్‌ ఉండడంతో అందులో తేమ కూడా మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 


ఈ పాముకు సంబంధించి వీడియోను @WildlifeDiaries47 అనే య్యూటుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. అలాగే ఇప్పటికీ ఈ వీడియో షేర్‌ చేసి కొన్ని రోజులవుతున్నప్పటికీ కొన్ని లక్షల మంది నెటిజన్స్‌ వీక్షించినట్లు సమాచారం. అలాగే ఈ వీడియోను 35 లక్షలకుపై సోషల్ మీడియా వినియోగదారులు లైక్‌ చేశారు. దీంతో పాటు కొన్ని వేల మంది షేర్‌ చేశారు. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. "పాము గుడ్ల నుండి పెద్ద పిల్లలు పుట్టవని.. పుట్టిన అవి వానపాముల లాగా చిన్నవిగా ఉంటాయని.. ఈ వీడియోలో ఆ చిన్న పాము వేగంగా పరిగెత్తడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని" ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇలా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.