Snake found inside mans shirt while bathing in dam video goes viral: పాములు చూస్తే చాలా మంది ఆమడదూరం పారిపోతుంటారు. చాలా మందికి పాములంటే వెన్నువణుకు అని చెప్పవచ్చు.వర్షాకాలంలో పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెరువులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతాలలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. చాలా మంది పాముల్ని చూడగానే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తుంటారు. మరికొందరు పాముకు ఆపద కల్గించకూడదని చెబుతుంటారు. కొంద మంది మాత్రం పాములపైన దాడులు చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కానీ పాములకు చెడు చేస్తే.. కాలసర్పదోషం వంటి సమస్యలువస్తాయి. దీనివల్ల కెరియర్ లో అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి.అంతేకాకుండా.. పెళ్లి కూడా తొందరగా సెల్ కాదు. పెళ్లి అయిన కూడా సంతానం విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. పాములకు చెందిన వెరైటీ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తుంది. 


పూర్తి వివరాలు.. 


పాములకు చెందిన కంటెంట్ సోషల్ మీడియాలో తరచుగా వార్తలలో ఉంటుంది. నెటిజన్లు కూడా పాములకు చెందిన వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. భారీ వర్షాలతో డ్యామ్ లు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో చాలా మంది డ్యామ్ లు, చెరువుల దగ్గరకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చెరువుల్లో, డ్యామ్ లలో స్నానాలు చేసేటప్పుడు అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి.


తరచుగా షార్క్ ల దాడులు, చేపల దాడులు,  మొసళ్ల దాడులను  మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి  డ్రెస్ లో ఏకంగా పాము దూరిపోయింది. అతను స్నానం కోసం డ్యామ్ లోకి దిగాడు. డ్యామ్ లో నిండుకుండలా ఉంది. ఇంతలో అతని బట్టలలో ఏదో దూరినట్లు అన్పించింది.వెంటనే బైటకు పరుగులు పెట్టాడు. ఆ తర్వాత చూస్తే.. ఒక భారీ సర్పం కన్పించింది.


Read more: Swetha Naagu: శ్రావణంలో అద్భుతం.. జనావాసాల్లోకి వచ్చిన అరుదైన శ్వేత నాగు.. వీడియో వైరల్..


అది ఎక్కడ కాటు వేస్తుందో అని.. అతను తెగ టెన్షన్ పడ్డాడు .చివరకు పామును పట్టుకుని బైటకు విసిరేశాడు.పాము కాటు వేయకపోవడంతో అతను.. హమ్మబాబోయ్ ...అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదెక్కడి ట్విస్ట్ అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి