Swetha Naagu: శ్రావణంలో అద్భుతం.. జనావాసాల్లోకి వచ్చిన అరుదైన శ్వేత నాగు.. వీడియో వైరల్..

Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రజంతా ఎంతో భక్తి భావనలతో ఉంటారు. ఈ మాసమంతా ప్రతిరోజు ఏదో ఒక పండుగలు వస్తునే ఉంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత అరుదైన శ్వేత నాగు బైటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 18, 2024, 03:51 PM IST
  • పొదల్లో నుంచి బైటకు వచ్చిన శ్వేత నాగు..
  • మార్కెట్ లో ఫుల్ డిమాండ్ అంటున్న నిపుణులు..
Swetha Naagu: శ్రావణంలో అద్భుతం.. జనావాసాల్లోకి వచ్చిన అరుదైన శ్వేత నాగు.. వీడియో వైరల్..

white colour venomous snake in chamba himachal Pradesh video goes viral: శ్రావణమాసాన్ని పండుగల మాసం అనిచెబుతుంటారు. ఈనెలంతా ప్రతిరోజున ఏదో ఒక పండుగ ఉంటునే ఉంటుంది. ఈ క్రమంలో రాఖీ పౌర్ణమి వేళ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక శ్వేత నాగు జనావాసాల్లో వచ్చింది. సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరు భయంతో పారిపోతుంటారు. పాములు ఉన్న చోట పొరపాటున కూడా వెళ్లరు. ఎక్కడైన పాము అని పేరు వినిపించిన కూడా అక్కడి నుంచి దూరంగా పారిపోతుంటారు.  అడవులు, కొండలు, దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశంలో పాములు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాములు ఎలుకల కోసం మన  ఇళ్లకు వస్తుంటాయి. బియ్యం సంచులదగ్గర, సజ్జలు, బట్టలలో పాములు నక్కి ఉంటాయి.

 

కొన్నిసార్లు బైక్ లు, కార్లు, హెల్మెట్ లలో కూడా పాములు దూరిపోతుంటాయి. షూస్ లలో కూడా పాములు బైటపడిన సంఘటనలు ఉన్నాయి. పాముల వెరైటీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.  కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యలో ఒక శ్వేత నాగు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.

పూర్తివివరాలు..
 

హిమచల్ ప్రదేశ్ లోని కోయంబత్తురులో ఒక పాము హల్ చల్ చేసింది. స్థానికంగా ఉన్న చంపా ప్రాంతంలోని పోలంలో ఉన్నట్లుండి శ్వేత నాగు కన్పించింది. అది దాదాపుగా.. 8 ఫీట్ల పొడవు ఉంది. అంతేకాకుండా.. పడగ విప్పి అక్కడున్నవారినిచూసి మరల పొదల్లోకి వెళ్లింది. అక్కడున్న కొంత మంది శ్వేత నాగును చూసి, తమ ఫోన్ లలో వీడియోను రికార్డు తీశారు. శ్వేత నాగు అనేది అర్బినో జాతీకి చెందిన పాముగా చెప్తుంటారు.

ఇది అత్యంత అరుదైన పాముగా కూడా చెప్తుంటారు. ఇది చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఉంటుందని, వేలల్లో పాములుంటే.. పదుల సంఖ్యలో మాత్రమే శ్వేత నాగులు ఎప్పుడైన బైటకు కన్పిస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు. శ్రావణంలో నేపథ్యంలో శ్వేత నాగు బైటకు రావడంతో అక్కడున్న వారు ఆనందంతో, మొక్కుకున్నారు. కొంత మంది ఆ పామును దైవంగా భావించి, అక్కడే దండం పెట్టుకున్నారు. మరోవైపు శ్వేతనాగులకు బహిరంగ మార్కెట్ లోఫుల్ డిమాండ్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News