Snake Viral Video: ఒళ్లు గగుర్పాటు కల్గించే వీడియో ఇది. చెవిలో దూరిన పాము..నోరు విప్పి చూస్తుంటే ఎలా ఉంటుంది. ఆలోచనకే అందడం లేదు కదా. మరి చూస్తే ఇంకెలా ఉంటుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను గతంలో మీరెప్పుడూ చూసుండరు. ఎలా వెళ్లిందో..ఏంటో తెలియదు. ఓ మహిళ చెవిలో పాము దూరిపోయింది. ముఖభాగం బయటకు కన్పిస్తోంది. నోరు విప్పి మరీ చూస్తోంది. చదువుతుంటేనే ఒళ్లు గగుర్పాటు కలుగుతోంది కదా. మరి చూస్తే ఇంకెలా ఉంటుంది. ఆ పామును బయటకు తీసేందుకు ఓ డాక్టర్ ప్రయత్నించడం కూడా చూడవచ్చు. చిన్న చిన్న టూల్స్ సహాయంతో పామును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓ వైద్యుడు.


ఆ మహిళ చెవిలో పాము నోరు విప్పి కన్పిస్తోంది. డాక్టర్ చిన్న టూల్ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంటే..నోరు తెరుస్తోంది. మరోవైపు నొప్పితో ఆ అమ్మాయి కేకలు బాధ ద్రవింపజేస్తుంది. ఈ వీడియో నిజంగానే షాకింగ్‌గా ఉంది. పామును బయటకు తీసే క్రమంలో పాము పూర్తిగా లోపలకు వెళ్లిపోతే పరిస్థితేంటి..అది తల్చుకుంటే ఇంకా భయమేస్తోంది. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పటిది అనేది తెలియదు.



ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. చెవిలో దూరిన పాము అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో పెద్దఎత్తున షేర్ అవుతోంది. ఇప్పటికే లక్షకుపైగా వీక్షించారు. ఇంతకీ పామను ఆ అమ్మాయి చెవిలోంచి బయటకు తీశారా లేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 


Also read: King Cobra Viral Video: బయ్యా అది పామా లేక పిప్పరమట్టా.. క్వారీలో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రాను ఎంత సులువుగా పట్టాడో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook