King Cobra Man Viral Video, Snake Catcher Vava Suresh Caught 12 feet King Cobra: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. చిరుత, సింహం, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు సరదాగా ఉంటే.. మరికొన్ని సంబ్రమాశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా భయబ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వారీలో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి చాలా సులువుగా పట్టుకున్నాడు.
వావ సురేష్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్‌గా కేరళలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ స్నేక్స్‌ని అయినా చాలా సులువుగా పట్టుకుంటాడు. అతను 50,000 కంటే ఎక్కువ పాములను పట్టుకుని రక్షించాడు. అందులో దాదాపుగా 200 కింగ్ కోబ్రాలు ఉన్నాయి. సురేష్ 300 సార్లు విషపూరిత పాములు కాటుకు గురయ్యాడు. మాములు పాముల కాటుకు అయితే లెక్కేలేదు. పాము కాటు కారణంగా ఆరు సార్లు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అంతరించిపోతున్న జాతుల పాములను రక్షించడం కోసమే సురేష్ ఇదంతా చేస్తున్నాడు. పాముల గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తాడు.
స్నేక్ క్యాచర్ సురేష్ కు సొంత యూట్యూబ్ ఛానెల్ (Kaumudy) కూడా ఉంది. ఆ ఛానెల్లో స్నేక్ క్యాచింగ్ వీడియోలు, విషపూరిత జంతువుల వీడియోలే ఉంటాయి. ఎక్కువగా కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియోలు ఉంటాయి. సురేష్ అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాలను చాలా సులువుగా పడుతుంటాడు. ఈ క్రమంలోనే ఓ క్వారీలో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రాను కూడా ఒట్టి చేతులతోనే బయటకు తెచ్చి.. జనాలకు చూపించి సంచిలో బంధించాడు. చాలా సమయం కింగ్ కోబ్రాతో ఆదుకున్న తర్వాత అక్కడి నుంచి దాన్ని పట్టుకుపోతాడు.
స్నేక్ క్యాచర్ వావ సురేష్ కు పోలీసులు తమ వంతు సహాయం అందిస్తారు. ఈ వీడియో పాతదే అయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'సురేష్ చాలా గ్రేట్' అంటూ ఒకరు కామెంట్ చేయగా.. 'బయ్యా అది పామా లేక పిప్పరమట్ఠా.. అంత సులువుగా పట్టుకున్నావ్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు! 80 శాతం తగ్గింపు
Also Read: Dinesh Karthik: కలలు నిజమవుతాయి.. దినేశ్ కార్తీక్ భావోద్వేగం! ఆ ఒక్క మాటతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook