Snake team rescued 18 feet long cobra was hiding in the drain video viral: కొందరు చిన్న పాముల్ని చూస్తేనే భయపడిపారిపోతుంటారు. కానీ స్నేక్ సోసైటీవారు ఎంతో చాకచక్యంగా పాముల్ని పట్టుకుంటారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిలా ఉండగా.. మరికొన్ని చూస్తేనే భయపడిపోయేలా కూడా ఉంటాయి. నెటిజన్లు పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. పాములను చూస్తేనే చాలా మంది  భయంతో పారిపోతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరికొందరు మాత్రం.. పాములు కన్పిస్తే ఆ ప్రదేశానికి వెళ్లరు. పాము.. అని తలవడానికి కూడా తెగభయపడిపోతుంటారు. కొందరు పెద్దలు,పాముల్ని చంపితే.. కాలసర్పదోషం చుట్టుకుంటుందని చెప్తుంటారు. అందుకే పాముల్ని ఎట్టి పరిస్థితుల్లోను ఆపద కల్గించరు. ఈ క్రమంలో పాములు వర్షాకాలంలో ఎక్కువగా బైటకువస్తుంటాయి. అడవులు, గుట్టలు దగ్గరగా ఉన్నవారి ఇళ్లలోకి పాములు ఎక్కువగా వస్తుంటాయి. ఎలుకలవేటలో పాములు వస్తుంటాయి. కొన్నిసార్లు పాములు మనుషులను కాటు వేస్తుంటాయి. కానీ కొందరు పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ హెల్పింగ్ సొసైటీవారికి సమాచారం ఇస్తారు.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఇక్కడ ఒక 18 అడుగుల భారీ సర్పం డ్రైనేజీ నుంచి బైటపడింది.దీంతో అక్కడున్న వారు స్నేక్ టీమ్ కు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగారు. పామును తోక పట్టుకుని బైటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో పాము ఎన్నిసార్లు ప్రయత్నించిన కూడా అది డ్రైనేజీలోకి దూరిపోతుంది.


Read more: Snake: వామ్మో.. వనపర్తిలో కలకలం.. ఇంట్లో దూరిన పదడుగుల భారీ సర్పం.. వైరల్ గా మారిన వీడియో..


దీంతో స్నేక్ సొసైటీ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా పామును బైటకు తీశారు. అది పలుమార్లు కాటేయడానికి ప్రయత్నించింది. చివరకు పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ రే.. ఎంతపెద్ద పామో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పామును చూసి షాక్ కు గురౌతున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter