జస్ట్ వన్ సెకండ్.. తృటిలో పాముకాటు నుంచి తప్పించుకున్న చిన్నారి.. తల్లి ధైర్యానికి వందనాలు
A child narrowly escaped form the bite of cobra. తాజాగా సోషల్ వీడియోలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద నాగు పాము కాటు నుంచి ఓ చిన్నారి తృటిలో తప్పించుకుంది.
A child narrowly escaped form the bite of cobra: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. మనుషులు, జంతువులకు సంబందించిన చాలా వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద నాగు పాము కాటు నుంచి ఓ చిన్నారి తృటిలో తప్పించుకుంది.
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పుట్టలు, బొరియలు మొత్తం నీటితో నిండిపోయాయి. చల్లదనానికి పాములు పుట్టలోంచి బయటికి వస్తున్నాయి. ఇలా బయటికి వచ్చిన ఓ పెద్ద నాగు పాము కర్ణాటకలో ఓ చిన్నారిని కాటేయబోయింది. మాండ్యలోని ఓ ఇంట్లో నుంచి తల్లి, కూతురు బయటికి వస్తున్నారు. మెట్ల కింద పెద్ద పాము పాక్కుంటూ వస్తుండగా.. చిన్నారి చూసుకోకుండా అడుగు వేసింది. వెంటనే పాము వెనక్కి తిరిగింది.
పామును గమనించిన తల్లి ఒక్కసారిగా కేక వేసింది. దాంతో హడలిపోయిన చిన్నారి అయోమయంలో పాము వైపుకు దూసుకుపోయింది. వెంటనే చిన్నారి చేతును పట్టుకుని తల్లి వెనక్కి లాగడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. ఆపై పడగ విప్పిన పాము అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'వర్షా కాలంలో పాముల పట్ల జాగ్రత్తగా ఉండండి. కర్ణాటకలోని మాండ్యలో రికార్డు అయిన ఈ CCTV ఫుటేజీని చుడండి. తల్లి ధైర్యానికి వందనాలు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ట్విట్టర్‌లో 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.
Also Read: Sun Transit 2022: 3 రోజుల తర్వాత.. ఈ రాశుల వారిని వరించనున్న అదృష్టం! ఇక డబ్బేడబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook