Snake Vs Scorpion Viral Video: అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు ఒకటి.. వీటిల్లో కొన్ని పాములు డేంజర్ అయినప్పటికీ మరికొన్ని పాములు మాత్రం ఇతర జీవులకు ఎలాంటి హాని కలిగించవు. అయితే మనం తరచుగా కట్లపాములతో పాటు కోడెనాగులు, రక్తపింజర్లు చూస్తూ ఉంటాం.. ముఖ్యంగా ఇందులో రక్తపింజర కాటు వేస్తే తప్పకుండా మనిషి లేదా ఇతర జీవులేవైనా మరణిస్తాయన్న సంగతి తెలిసిందే.. అలాగే ఇది కాటేసిన చోట చిన్న గాయమైనప్పటికీ.. కానీ నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా చాలామంది వీటిని చంపుతూ ఉంటారు. అయితే సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం, వీటిని చంపిన కొన్ని గంటల పాటు కూడా వాటి నాడీ వ్యవస్థ ఎంతో చురుకుగా ఆరోగ్యంగా ఉంటుందట. అంతేకాకుండా ఇవి ఒక అద్భుతమైన శక్తిని కూడా కలిగి ఉంటాయట. అయితే ఇటీవల రక్తపింజర సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నేటిజన్లు షాక్ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వీడియో వివరాల్లోకి వెళితే... బాగా ఆకలి మీద ఉన్న రక్తపింజర పాము ఏకంగా దానికి పోటీని ఇచ్చే, తేలునే ఆహారంగా మలుచుకోవాలని చూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే.. ఒక భయంకరమైన పాము ఆహారం కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇంతలోనే ఆ పాముకు ఒక పెద్ద నల్లని తేలు కనిపిస్తూ ఉంటుంది. ఈ పాము ఏమాత్రం లెక్క చేయకుండా వెంటనే ఆ తేలు దగ్గరికి వెళ్లి, ఏకంగా దాని నోటితోనే పట్టేసుకుంటుంది. ఇలా పాము తన నోటితో నెమ్మది నెమ్మదిగా తేలును కొరుకుతూ ఉంటుంది. పాము ఆ తేలును ఎలాగైనా మింగాలని తపనతో నెమ్మది నెమ్మదిగా పేలును నోటి లోపలికి లాగేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలోనే పాముకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. 





ఎలాగైనా తేలును పాము మింగాలని చూసిన.. చివరికి అనుకున్న దానికంటే అయ్యింది ఒకటయ్యింది.. తల భాగాన్ని మింగాలని చూసిన పాము తేలు ఓ గట్టి షాక్ ఇచ్చింది. అయితే తేలు దానికి ఉన్న రెండు కుండీలతో ఏకంగా పాము తలను గట్టిగా పట్టేసింది. తేలు పాము నోట్లో నుంచి ఎలాగైనా బయటపడి ఎందుకు తన బలాన్ని అంతా ఉపయోగించి గట్టిగా కుండీలతో పట్టేసుకుంది. ఇలా కొద్దిసేపు రెండిటి మధ్య గట్టి పోటీ నడిచింది. నేనంటే నేనని రెండు ఏమాత్రం తగ్గకుండా ఒకదానికొకటి ఫైట్ చేశాయి. ఇలా ఫైట్ చేసిన వీడియోను కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా వరకు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇది అందులో చాలా ప్రత్యేకమైనది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను rijeskv_08 అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసి కొద్దిరోజుల అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది నెటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో పై వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. కొంతమందికి ఈ వీడియో ఎంతో భయానకంగా అనిపించినప్పటికీ కొంతమందికి ఇంట్రెస్ట్ కలిగించింది. అయితే ఇప్పటికీ ఈ వీడియోను కొన్ని మిలియన్లకు పైగా మంది. వీక్షించారు. అంతేకాకుండా లక్షల మంది లైక్ చేసినట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter