Snake drinks Water With in Seconds From Glass: సాధారణంగా పాములు నీటిని ఎక్కువగా తాగవట. పాములు ఎక్కువగా నీటిని తీసుకోవు అని నిపుణులు కూడా అంటున్నారు. అరుదుగా మాత్రమే పాములు నీటిని తాగుతుంటాయట. పాము తల కింద భాగాన్ని నీటిలోకి తాకించడం వల్ల ఆ చర్మపు పొరల గుండా నీరు లోపలికి వెళుతుందట. పాముల ఆహార వాహికలోకి క్యాపిల్లారిటీ అనే ధర్మం వల్ల నీరు ప్రవేశిస్తుందని అంటారు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలో పాము గ్లాసులోని నీటిని ఖాళీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రిచ్‌స్నేక్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పాముకు సంబందించిన వీడియో షేర్ చేయబడింది. వీడియోలోని పాము.. కొండ చిలువలా గ్లాస్‌లోని నీరు తాగింది. పాము తన తలను గ్లాసులోని నీటిలో పెట్టి చాలా వేగంగా తాగేసింది. సెకన్లలో గ్లాసులోని నీరు ఖాళీ చేసింది. పాము నీటిని తాగేటపుడు దాని దవడలు కూడా కదులుతున్నాయి. 



సెకన్లలో గ్లాసులోని నీరుని పాము ఖాళీ చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. పాము నీరు తగ్గుతుందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటికిలక్ష్యకు పైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు కామెంట్ల వర్షం కురుస్తోంది. 'సెకన్లలో గ్లాసులోని నీటిని పాము ఖాళీ చేసిందా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇది నిజమేనా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


Also Read: అనుష్క శర్మతో బిజీగా ఉన్నా.. ప్లీజ్ డిస్టర్బ్‌ చేయకండి! విరాట్ కోహ్లీ వీడియో వైరల్


Also Read: లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల గ‌ర్బా డాన్స్.. ఫ‌న్ హ్యాజ్ నో లిమిట్‌ (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook