Garba Dance: లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల గ‌ర్బా డాన్స్.. ఫ‌న్ హ్యాజ్ నో లిమిట్‌ (వీడియో)

Women Perform Garba dance at Mumbai Local train. ముంబై లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల బృందం గ‌ర్బా నృత్యం చేసారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 29, 2022, 07:13 PM IST
  • లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల గ‌ర్బా డాన్స్
  • ఫ‌న్ హ్యాజ్ నో లిమిట్‌
  • ల‌క్ష‌కు పైగా వ్యూస్
Garba Dance: లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల గ‌ర్బా డాన్స్.. ఫ‌న్ హ్యాజ్ నో లిమిట్‌ (వీడియో)

Group of Women Perform Garba dance at Mumbai Local train: దేశమంతటా న‌వ‌రాత్రి వేడుక‌లు ప్రారంభం అయ్యాయి. ఏ గల్లీ లేదా వీధి చూసినా పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అమ్మవారి విగ్రహాలతో నగరాలు అన్ని కళకళలాడుతున్నాయి. ప్రజలందరూ డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై మెరైన్ డ్రైవ్‌లో ఇటీవ‌ల మ‌హిళ‌ల గ‌ర్బా పెర్ఫామెన్స్ చేయగా.. తాజాగా లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ‌ల బృందం గ‌ర్బా నృత్యం చేసారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.

ముంబైలో రద్దీగా ఉండే సబర్బన్ రైలు నగరంలోని కళ్యాణ్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు దాదాపు 10 మంది మహిళలు గ‌ర్బా పెర్ఫామ్ చేశారు. రంగురంగుల దుస్తులను ధరించిన ఆ మహిళలు.. గుడ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. క‌దులుతున్న లోక‌ల్ ట్రైన్‌లో ప్ర‌యాణీకులు చూస్తుండ‌గా.. వీరంతా ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. 'ముంబై రైల్వే యూజ‌ర్స్' అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. 

ఈ పోస్ట్‌కు ముంబై లోక‌ల్స్ క్రియేట్ మొమెంట్స్.. ఫ‌న్ హ్యాజ్ నో లిమిట్‌ అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ల‌క్ష‌కు పైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు లైకుల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన అందరూ.. మ‌హిళ‌ల స్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. మ‌హిళ‌లు డ్యాన్స్ అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీరు చూసి సంతోషించండి. 

Also Read: అనుష్క శర్మతో బిజీగా ఉన్నా.. ప్లీజ్ డిస్టర్బ్‌ చేయకండి! విరాట్ కోహ్లీ వీడియో వైరల్
Also Read: 'ఫీల్డింగ్'కా బాప్.. సురేష్ రైనా క్యాచ్ చూస్తే బిత్తరపోవాల్సిందే! చిరుత కంటే వేగంగా డైవ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News