Too Many Snakes in Open Well: బావి నిండి భయంకరమైన నాగుపాములు, రక్త పింజర్లు.. ఎంత తెలివిగా పట్టాడో చూడండి
Too Many Snakes in Open Well: నీళ్లు లేకుండా పాడుబడిన ఒక వ్యవసాయ బావి నిండా పాములు పుట్టలు పెట్టాయి. అది కూడా ఒకట్రెండు రకాల పాములు కాదండోయ్.. నాగు పాము, రక్త పింజర, కట్ల పాములు.. ఇలా ఎన్నో రకాల పాములు ఆ బావిలో గూడు పెట్టుకుని ఉన్నాయి.
Too Many Snakes in Open Well: నీళ్లు లేకుండా పాడుబడిన ఒక వ్యవసాయ బావి నిండా పాములు పుట్టలు పెట్టాయి. అది కూడా ఒకట్రెండు రకాల పాములు కాదండోయ్.. నాగు పాము, రక్త పింజర, కట్ల పాములు.. ఇలా ఎన్నో రకాల పాములు ఆ బావిలో గూడు పెట్టుకుని ఉన్నాయి. బావిలో పాములు గూడు పెట్టుకుని ఉండటం చూసిన అదే ఊరికి చెందిన వ్యక్తి వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించాడు. గ్రామస్తుడు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి.. ముందుగా ఆ బావిలో గూడు పెట్టుకున్న పాములను చూపిస్తూ వాటి గురించి వివరించాడు.
ఇదిగో ఇక్కడ లోపల మట్టి రంగులో ఉండి, మట్టిలోనే కలిసిపోయినట్టుగా కనిపిస్తున్న ఈ భయంకరమైన పాము ఆసియాలోనే డేంజరస్‌గా స్నేక్‌గా గుర్తింపు ఉంది. ఈ పాము ఒకేసారి 70 నుంచి 75 పిల్లలను పెడుతుంది అని స్నేక్ క్యాచర్ చెప్పుకొచ్చాడు. ఈ పాము కరిస్తే విషం పాకిన చోటు శరీరం విషపూరితమై పనిచేయకుండా పోతుంది అని.. అవసరమైతే ఆ శరీరభాగాన్ని తొలగించాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్నేక్ క్యాచర్ తెలిపాడు.
ఆ తరువాత బావిలో నీరు లేకపోవడం వల్లే అవి గూడు పెట్టాయని.. ఇవి భయంకరమైన విష సర్పాలు కనుక ఇవి ఇందులో, ఇలానే ఉంటే వీటి వల్ల ఎప్పుడో ఒకసారి ఎవరికైనా ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించాడు. బావి నిండా పాములే ఉన్నాయి కనుక అందులోకి దిగి పట్టుకోవడం కుదరదని.. బావిలో నీరు నింపడం ద్వారా పాములే బయటికి వచ్చేలా చేయొచ్చు అని సూచించాడు. స్నేక్ క్యాచర్ సూచన మేరకు గ్రామస్తులు పెద్ద నీటి పైపు వేసి మోటర్ ద్వారా ఆ బావిని నింపారు. దీంతో బావిలో నీళ్లు పైకి ఉబికి వస్తున్నట్టుగానే.. పాములు కూడా బయటికి రావడం మొదలుపెట్టాయి.
ఇది కూడా చదవండి : Lion Vs Farmer Video: ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి ఆవును రక్షించిన రైతు
అప్పటివరకు ఆ బావి చుట్టూ ధైర్యంగా నిలబడి చూసిన గ్రామస్తులు అందరూ.. అతడు పాములను పట్టి బంధిస్తుండటం చూసి దూరంగా పరుగెత్తసాగారు. పట్టిన పాములను పట్టినట్టే ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించసాగాడు. ఆ పాములకు ఊపిరి ఆడేందుకు ఆ డబ్బాలకు రంద్రాలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇదే స్నేక్ క్యాచర్ గతంలోనూ రెండు జంట పాములను పట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను కూడా మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఇదిగో ఇక్కడ మరోసారి ఆ వైరల్ వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. ప్లీజ్ హావ్ టేక్ ఏ లుక్ ఎట్ దిస్ వైరల్ వీడియో.
ఇది కూడా చదవండి : Mutton Maggi Recipes: మ్యాగీ మటన్ ఎప్పుడైనా ట్రై చేశారా ? లేదంటే ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK