South Korean Elon Musk Deepfake Fraud: టెక్నాలజీ రోజురోజుకు ఎంతో డెవలప్ అవుతుంది. దీన్ని కొందరు తమ డెవలప్ మెంట్ కోసం వాడుకుంటుండగా మారికొందరు మాత్రం మోసాలకు పాల్పడటానికి ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో మోసాలకు పాల్పడేవారుఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. ఒకప్పుడు ఫోన్ లు చేసి మీరు కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. కస్టమ్స్ డ్యూటీ కింద కొంత డబ్బులు జమచేయాలని చెప్పేవారు కొందరు దీన్ని నమ్మేసి డబ్బులు చెల్లించాక మోసపోయామని తెలిసి లబోదిబోమనేవారు. ఇక మరోవిధంగా, సోషల్ మీడియాలో కొందరు అమ్మాయిల మాదిరిగా చాటింగ్ కు పాల్పడేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Angry Girl Acid attack On Boyfriend: పెళ్లిలో ఊహించని ఘటన.. వరుడిపై యాసిడ్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్..


అంతేకాకుండా.. సీక్రెట్ గా ముగ్గులోకి దింపి, ఆ తర్వాత ప్రేమాయణం నడిపించేవారు. సీక్రెట్ గా న్యూడ్ ఫోన్ కాల్స్ వంటికి చేసుకునేవారు.ఈ క్రమంలో అవతలి వారిని పూర్తిగా రికార్డు చేసి, ఆతర్వాత డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడేవారు. ఇలాంటి ఘటనలు కూడా అనేకం సోషల్ మీడియాలో చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో..ఫెస్ బుక్ లో నకిలీ ఐడీలను క్రియేట్ చేసి ఫెస్ బుక్ లో మెస్సెంజర్ లకు డబ్బులు పంపమని చెప్పడం కూడా చేశారు. ఇది కూడా కొన్నిసార్లు ఆన్ లైన్ కేటుగాళ్లకు వరంగానే మారింది. ఇటీవల డీప్ ఫెక్ టెక్నాలజీ తో కూడా మోసాలకు పాల్పడిన ఘటనలు వార్తలో ఉంటున్నాయి. ముఖ్యంగా.. అనేక మంది హీరోయిన్లు ఇటీవల ఈ డీఫ్ ఫెక్ టెక్నాలజీ ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై చర్యలు తీసుకొవాలని కూడా అనేక మంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈక్రమంలో తాజాగా, సౌత్ కోరియాకు చెందిన ఒక జియోంగ్ జి-సన్ అనే మహిళ ఈ డీప్ ఫెక్ వీడియో ఫ్రాడ్ బారిన పడింది.


పూర్తి వివరాలు.. 



సౌత్ కొరియాకు చెందిన మహిళకు గతేడాది ఇన్ స్టాలో ఎలాన్ మస్క్ తో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఎలాన్ మస్క్ కాదు. డీప్ ఫెక్ టెక్నాలజీని ఉపయోగించుకుని మోసానికి పాల్పడుతున్నారు. సదరు బాధితురాలితో ఆన్ లైన్ మోసగానికి , గతేడాది పరిచం ఏర్పడింది. అప్పటి నుంచి తనకు తానుగా ఎలాన్ మస్క్ అని పరిచయం చేసుకున్నాడు. ఆమెతో పాటు వీడియో కాల్స్ మాట్లాడాడు. తన బిజినెస్ గురించి, కంపెనీ షేర్లు ఇలా అన్నింటిపై ఆమెకు నమ్మకం కలిగేలా మాట్లాడి మహిళను ముగ్గులోకి దింపాడు. దీంతో పాపం.. మహిళ పూర్తిగా అతగాడి మాటలను నమ్మేసింది. దీంతో  ఒక రోజున స్కామర్ చివరికి 70 మిలియన్ కొరియన్ వోన్ లేదా $50,000ని తన కొరియన్ ఉద్యోగులలో ఒకరికి చెందినదని అతను చెప్పిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని ఒప్పించాడు. దీనిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఓవర్ నైట్ లో కోటీశ్వరులను చేస్తానంటూ కూడా ఆమెను నమ్మించాడు.  


Read More: Viral Video: నా భార్య సీట్లోనే కూర్చుంటావా..?.. బస్సులో కోట్లాటకు దిగిన భర్తలు.. వైరల్ వీడియో..


దక్షిణ కొరియా మహిళ ఎలోన్ మస్క్‌గా నటిస్తూ స్కామర్‌తో ప్రేమలో పడింది. అతను చెప్పినట్లుగా..  ₹ 41 లక్షలను అతను చెప్పిన అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసింది. కొన్నిరోజులకు అతని నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో, సదరు మహిళ మోసపోయినట్లు గ్రహించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ విధంగా మోసపోయినట్లు సదరు మహిళ బాధపడుతు పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ మోసానికి డీప్ ఫెక్ టెక్నాలజీనీ ఉపయోంచుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక టెస్లా కంపెనీకి అధినేత.. ఇలా మాట్లాతుడాని నువ్వేలా నమ్మావ్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter