Korean Girl Harassment Video: కొంతమంది ఆకతాయిల వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు.. తమలోని మృగాలను బయటపెడుతున్నారు. తాజాగా ముంబై వీధిలో దక్షిణ కొరియా యూట్యూబర్‌ను వేధింపులకు గురి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో రికార్డు అవుతుందనే విషయం తెలిసినా.. యువతి చేయి పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు ఓ ఆకతాయి. ఈ ఒక్క నిమిషం నిడివి గల ఈ వీడియోలో యువతి వద్దని సున్నితంగా వారిస్తున్నా.. ఆమె చేయిపట్టుకుని బైక్‌పై రావాలని అడిగాడు. వాళ్ల నుంచి తప్పించుకుని ఈ వీడియోను షేర్ చేసిన ట్విట్టర్‌లో షేర్ చేసింది ఆ యువతి. ఈ ఘటన బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ సందర్భంగా కొరియన్ యువతిని వేధించిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోలో నిందితులలో ఒకరు కొరియన్ యూట్యూబర్‌ని ఖార్‌లో తన చేతితో లాగడం కనిపించింది. 'ఇంటికి వెళ్లే సమయం వచ్చింది' అని ఆ అమ్మాయి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. యువకుడు మళ్లీ స్కూటీతో తిరిగి వచ్చాడు. అతనితో పాటు మరొక అబ్బాయి కూడా కూర్చున్నాడు. అమ్మాయిని వెంబడించి.. బైక్‌పై ఎక్కించుకోవడానికి ప్రయత్నించాడు. తనకు లిఫ్ట్ అక్కర్లేదని.. తన ఇల్లు సమీపంలో ఉందని యువతి చెప్పింది.  


 



'నిన్న రాత్రి వీడియో స్ట్రీమింగ్‌లో చేస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. నేను పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేశాడు. నా స్నేహితురాలితో ఉన్నట్లుగా వెళ్లిపోయాను. నేను స్నేహపూర్వకంగా మాట్లాడేందుకు ప్రయత్నించా.  మాట్లాడుతున్న సమయంలోనే అతను నా చేయి పట్టుకుని లాగాడు. ఈ సంఘటన నన్ను స్ట్రీమింగ్ గురించి మళ్లీ ఆలోచించేలా చేస్తుంది..' అని యవతి ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేసింది. వీడియో ఆధారంగా పోలీసులు లైంగిక వేధింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


వీడియోను చూసి నెటిజన్లు యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతి చేయి పట్టుకున్న యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరి యువకులను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Also Read: Babar Azam: అప్పుడు కోహ్లీ పేరు చెప్పి.. ఇప్పుడు మాట మార్చిన బాబర్ ఆజమ్  


Also Read: Bandi Sanjay: కేసీఆర్.. అసెంబ్లీలో చెంపలేసుకో.. డబ్బులిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్ వార్నింగ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook