spicejet woman employee slaps cisf asi in Jaipur airport: కొందరు పోలీసులు వెకిలీ చేష్టలు వేస్తుంటారు. ఇటీవల కొందరు పోలీసులు కూడా మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో తమకు అన్యాయం జరిగితే బాధితులు పోలీసుల దగ్గరకు వచ్చి తమ గొడును చెప్పుకుంటారు. అలాంటిది... పోలీసులే మహిళల పట్ల దారుణాలకు పాల్పడటం, అత్యాచారాలకు పాల్పడటం వంటి ఘటనలు మహిళల, అమ్మాయిల భద్రతకు పెనుసవాల్ గా మారాయి. పోలీసులు తమ సహోద్యోగులను బెదిరించి అత్యాచారాలు చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఇటీవల ఒక ఎయిర్ పోర్టులో లేడీ స్పైస్ జెట్ ఉద్యోగిని, అక్కడే విధుల్లో ఉన్న సీఎస్ఎఫ్ అధికారిని లాగిపెట్టి కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పూర్తి వివరాలు..


రాజస్థాన్ లోని జైపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జైపూర్ ఎయిర్ పోర్టులో..స్పైస్ జెట్ ఉద్యోగిని అనురాధ, అక్కడే విధుల్లో ఉన్న సీఎస్ఎఫ్ఐ పోలీసు గిరిరాజ్ ను చెంప మీద కొట్టింది.  ఈక్రమంలో దీనిపై ఎవరికి వారు భిన్న వాదనలు విన్పిస్తున్నారు. స్పైస్ జెట్ ఉద్యోగిని.. అనురాధ సరైన అనుమతి లేకుండా వెహికిల్ గేట్ ద్వారా.. ప్రాంగణంలోనికి రావాలని ప్రయత్నించగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గిరిరాజ్ ప్రసాద్ అనుమతించలేదు. దీంతో ఆమె ఆవేశంతో ఆయన చెంప మీద కొట్టిందని పోలీసులు చెప్పుకోచ్చారు. కానీ స్పైస్ జెట్ ఉద్యోగిని మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.


ఏఎస్ఐ తనను లైంగికంగా వేధించాడని, డ్యూటీ తర్వాత తన క్వార్టర్ కు రావాలని అసభ్యంగా మాట్లాడాడని చెప్పింది. దీంతో భరించలేక కొట్టినట్లు స్పైస్ ఉద్యోగిని అనురాధ కొట్టిందని స్పైస్ యాజామాన్యం స్పష్టం చేసింది. ఈ క్రమంలో దీనిపై తీవ్ర దుమారంచెలరేగింది. ప్రస్తుతం పోలీసులు అనురాధను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పైస్ సిబ్బంది సైతం.. ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.


ఈ ఘటనపై స్పైస్ యాజమాన్యం సైతం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం దీనిపై విచారణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం స్పైస్ జెట్ ఉద్యోగినికి సపోర్ట్ చేస్తు కామెంట్లు పెడుతున్నారు. పోలీసు.. ఏదో గెలికుంటాడు.. అందుకు అలా కొట్టి ఉంటుందని కూడా కామెంట్లు పెడుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి