Squirrel Girl Viral Video, Squirrel bite LIttle Girl Hand at Road: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, మనుషులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఉడుత నడిరోడ్డుపై ఓ చిన్న అమ్మాయితో ఆడుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ చిన్న అమ్మాయి తెల్లటి ఓవర్‌కోట్, బ్లాక్ ప్యాంట్, షూస్ మరియు క్యాప్ పెట్టుకుని రొడ్డిపైకి వచ్చింది. కాసంత దూరంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారు. నడిరోడ్డుపై ఆ చిన్నారి ఓ ఉడతతో ఆడుకుంటుంది. తన చేతిలో ఉన్న వస్తువును ఉడతకు చిన్నారి చూపిస్తుంది. దాంతో చేతిలో ఉన్న దాన్ని అందుకునేందుకు.. ఉడత ఏకంగా ఆ చిన్నారి కోటు పైకి ఎక్కుతుంది. చేతిలో ఉన్న పదార్థాన్ని తిని.. చిన్నారి చేతికి కొరికి వెళ్ళిపోతుంది. 



ఉడత చిన్నగా కొరకడంతో ఆ చిన్నారి నవ్వులు పూయిస్తుంది. ఉడతకు సంబంధించిన వీడియోను 'బ్యూటెంగెబిడెన్' (Buitengebieden) అనే ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'లిటిల్ ప్రిన్సెస్' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ట్విట్టర్‌లో 468.4K వ్యూస్ సంపాదించింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అమ్మో.. ఇది సహతోపేతమైన ఉడుత' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'చిలిపి ఉడత' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


Also Read: Jio Best Recharge Offer: జియో రూ. 61 రీఛార్జ్ ప్లాన్.. ఈ ప్లాన్‌కి ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా హడల్!


Also Read: Most T20I Hundreds: టీ20ల్లో అత్యధిక సెంచరీలు.. టాప్‌లో రోహిత్ శర్మ! సూర్యకుమార్‌ది ఎన్నో స్థానమో తెలుసా 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.