Bizarre News: చెవిలో బొద్దింకతో మూడ్రోజులు నరకయాతన, ఆ తరువాత ఏమైంది
Bizarre News: చెవిలో చిన్న చీమ దూరితేనే తలకిందులైపోతుంటాం కదా. అటువంటిది ఆ వ్యక్తి చెవిలో ఏకంగా బొద్దింక దూరింది. అది కూడా మూడ్రోజుల పాటు బతికే ఉందట. విడ్డూరంగా ఉందా. ఇదీ ఆ కధ
Bizarre News: చెవిలో చిన్న చీమ దూరితేనే తలకిందులైపోతుంటాం కదా. అటువంటిది ఆ వ్యక్తి చెవిలో ఏకంగా బొద్దింక దూరింది. అది కూడా మూడ్రోజుల పాటు బతికే ఉందట. విడ్డూరంగా ఉందా. ఇదీ ఆ కధ
ఇది జరిగింది న్యూజిలాండ్ (NewZealand) దేశంలోని ఆక్లాండ్‌లో. 40 ఏళ్ల జోన్ వెడ్డింగ్ పరిస్థితి ఇది. జోన్ వెడ్డింగ్ వారం రోజుల క్రితం స్విమ్మింగ్ చేసొచ్చిన తరువాత అతని ఎడమ చెవిలో ఏదో చిన్న సమస్య ఎదురైంది ఆ రోజు అలాగే ఉండిపోయాడు. మరుసటి రోజు లేచేసరికి..ఎడమ చెవి బ్లాక్ అయిపోయుంది. చెవిలో ఏదో కదులుతున్నట్టుగా అన్పించేది. దగ్గరలో ఓ వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ కొన్ని యాంటీ బయోటిక్ మందులు రాసిచ్చి..హెయిర్ డ్రయర్‌తో చెవిని డ్రై చేయమని చెప్పాడు. కానీ ఫలితం లేకపోయింది. ఎడమ చెవి అసౌకర్యంగానే ఉంది. మరో రెండ్రోజులు అలాగే నిద్రలేని రాత్రులు గడిపాడు. చివరికి చేసేది లేక ఇఎన్‌టి వైద్యుని అప్పాయింట్‌మెంట్ తీసుకున్నాడు.
చెవిలో పరిశీలించి చూసేసరికి ఏదో పురుగు ఉన్నట్టు తెలిసింది. అది చూసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయింది. చెవిలో ఏదో కీటకముంది. నమ్మలేకపోతున్నా అంటూ...సక్షన్ డివైస్‌తో అప్పటికే చచ్చిపోయున్న బొద్దింకను బయటకు (Cockroach inside the Ear) తీసింది. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటన ఎదురుకానందున..ఓ జ్ఞాపకంగా ఉంచేసుకుంది ఆ బొద్దింకను.
Also read: Video : హార్ట్ టచింగ్.. పెంపుడు పిల్లి కోసం తల్లడిల్లిన వృద్ధుడు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook