Strange sounds coming from bathroom: బాత్రూమ్ నుంచి వింత శబ్ధాలు వస్తుండటం చూసి ఏం జరుగుతుందో అర్థం కాని ఓ కుటుంబం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. ఏవో ఈగలు చుట్టూ ముసురుకుని ఎగురుతున్న శబ్ధం తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శబ్ధం మరీ ఎక్కువ కాసాగింది. మొదట్లో కొద్దిగా వినిపించిన శబ్ధం (Mysterious sounds from walls) కాస్తా మరింత ఎక్కువైంది. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ ఆ కుటుంబం ఓ తేనేటీగలు పట్టే ఎక్స్‌పర్ట్‌ని పిలుచుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాష్ రూమ్‌ గోడల్లోంచి (Strange sounds from Washroom) ఈగలు ముసురుకుంటున్న శబ్ధం వస్తుంది కనుక తేనేటీగలు పట్టుకునే వాళ్లయితేనే మనకు ఈ సమస్య నుంచి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించగలరనే ఉద్దేశంతో ఆ కుటుంబం ఈ పని చేసింది.


తేనేటీగలు పట్టే ఎక్స్‌పర్ట్ (Honey bees expert) వచ్చి బాత్రూమ్‌లోని గోడలపై ఉన్న టైల్స్ పగలగొట్టి చూస్తే అక్కడ కనిపించిన సీన్ చూసి ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాకైంది. టైల్స్ వెనుక గోడపై పెద్ద తేనెతొట్టే పెట్టి ఉంది. అది కూడా ఒకట్రెండు అడుగుల తేనెతొట్టే కాదు.. ఏకంగా ఏడు అడుగులు ఎత్తైయిన తేనే తొట్టె. అందులో వందలు, వేల కొద్ది తేనెటీగలు. తేనేతొట్టే (How to extract honey from Beehive) నిండా పేరుకున్న తేనే. ఒళ్లు గగుర్పొడిచే ఆ సీన్ చూసి నోరెళ్లబెట్టడం ఆ కుటుంబం వంతయ్యింది. 


Also read : YouTube Logo Changed: యూట్యూబ్ లోగో ఎందుకు ఛేంజ్ అయ్యిందో తెలుసా?


అతి కష్టం మీద 5 గంటల పాటు శ్రమించి ఆ తేనెతొట్టేను తొలగించారు. ఆ తర్వాతే ఆ కుటుంబం హాయిగా నిద్రపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు (Viral videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Also read : Viral Video: ఓరి దీని ఏషాలో.. భలే నటిస్తోందే.. ముట్టుకుంటే చనిపోయినట్లుగా పడిపోతున్న పాము


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook