Tomato Ice Cream Video: స్ట్రీట్ ఫుడ్ ఎన్నిరకాలుగా ఉంటుందో చెప్పడం కష్టం. ఒక్క ఐటమ్ నే ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తయారు చేస్తారంటే.. అదీ చాలదన్నట్టుగా కొత్త కొత్త వెరైటీ ఫుడ్స్ కనిపెట్టే వారికి కూడా కొదువే లేదు. ఇదిగో ఇక్కడ ఓ వీధి వ్యాపారి చేస్తోన్న టొమాటో ఐస్‌క్రీం అలాంటిందే. అదేంటి.. టొమాటోతో ఐస్ క్రీమా అని అవాక్కవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మండు వేసవిలో మనకు ఐస్ క్రీమ్ కనిపిస్తే ఎలా ఉంటుంది.. గబుక్కున వెళ్లి ఐస్ క్రీమ్ కొనుక్కోని తింటూ హాయిగా ఫీల్ అవుతాం కదా... ప్రతీ ఒక్కరికి కాకపోయినా.. చాలామందికి ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కనిపించే మార్గాల్లో ఇదొక ఉత్తమమైన మార్గం అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఐస్ క్రీమ్స్ లో ఉన్నన్ని రకాల ఫ్లేవర్స్, వెరైటీలు మరెందులోనూ ఉండవు కదా.. అందులోనూ ఐస్ క్రీమ్ స్వయంగా తయారు చేసి విక్రయించే వారి వద్ద వెరైటీలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అది వారికి చేతిలో ఉన్న పనే కాబట్టి. ఇక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ వెండార్ కూడా అలా టొమాటోతో ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. అక్కడి వారికి ఇదొక క్రేజీ ఐస్ క్రీమ్ వెరైటీ అంటే నమ్ముతారా..


వీధి వ్యాపారులు ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించడం కోసం అనేక రుచులతో తమ వంటకాలను, ఇతర తినుబండారాలను ప్రజెంట్ చేస్తుంటారు అనే సంగతి తెలిసిందే. అచ్చం అలాగే ఒక స్ట్రీట్ ఫుడ్ వెండార్.. టొమాటోతో ఐస్‌క్రీమ్‌ తయారు చేయాలనే విచిత్రంగా ఆలోచించాడు. అనుకోవడమే ఆలస్యం.. తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. దాని ఫలితమే అతడికి భారీగా గిరాకీ రావడమే కాకుండా అతడిని సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ కూడా చేసింది.



 


ఇంతకీ టొమాటోతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేశాడంటే.. తరిగిన టొమాటోను మధ్యలో పెట్టి.. దానికి పంచదార పాకంలో ముంచితీశాడు. ఆ తరువాత తరిగిన టొమాటో పైన పాలు పోసి, అన్ని పదార్ధాలను కలిపేశాడు. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కేవలం 5 నిమిషాలే పడుతుంది అంటున్నాడు ఈ ఐస్ క్రీమ్ మేకర్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కింద నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 


ఇది కూడా చదవండి : king cobra with hood: పడగవిప్పి నిటారుగా నిలబడిన నాగు పాము 


ఇది కూడా చదవండి : Shark eats Russian Tourist: యువకుడిని అమాంతం మింగేసిన షార్క్.. వైరల్ అవుతున్న వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి