Shark eats Russian Tourist in Egypt Coast: రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఓ యువకుడిని సొరచేప అమాంతం నమిలి మింగేసింది. ఆ యువకుడు ఎంత ప్రయత్నించినప్పటికీ సొర చేప నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ వీడియో నెట్టింటలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
జూన్ 08న పొపొవ్ అనే రష్యన్ యువకుడు ఈత కోసం సముద్రంలోకి దిగాడు. అయితే ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన సొరచేపను అతడు గుర్తించలేకపోయాడు. స్థానికులు చూస్తుండగానే ఆ షార్క్ యువకుడిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన ఈజిప్టులోని హుర్గడా నగరంలోని ఓ రిసార్టు సమీపంలో జరిగింది. ఆ యువకుడి వయసు 23 ఏళ్లు.
Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort
23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X
— Nabila Jamal (@nabilajamal_) June 9, 2023
Also Read: Flying Saucer Viral Video: చైనాలో కనిపించిన ఫ్లయింగ్ సాసర్.. ఏలియెన్స్ చైనాకు వచ్చారా ?
ఆ షార్ కోసం బోట్ల సహాయంతో స్థానిక అధికారులు గాలించారు. చివరకు సొరచేపను వలల సహాయంతో పట్టుకుని దానిని పట్టి చంపారు. దీంతో ఆ సొరచేపను కోయగా.. ఆ యువకుడి శరీర భాగాలను అందులో గుర్తించారు. ఆ వ్యక్తిని షార్ మింగేటప్పుడు అతని తండ్రి అక్కడే ఉన్నాడు. తాజా ఘటనతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నీళ్లున్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook