Viral Video: క్లాస్‌లో టీచర్‌కు డ్యాన్స్ నేర్పించిన స్టూడెంట్స్..నెట్టింట చెక్కర్లు కొడుతున్న వీడియో..!!
Teacher Student Viral Video: నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్, స్టూడెంట్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీచర్ పదవి విరమణ చేసిన సందర్భంగా పాఠశాలలో చివరి రోజు కావడంతో..ఆమె పిల్లలతో సరదగా డ్యాన్స్ చేశారు.
Teacher Student Viral Video: నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్, స్టూడెంట్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీచర్ పదవి విరమణ చేసిన సందర్భంగా పాఠశాలలో చివరి రోజు కావడంతో..ఆమె పిల్లలతో సరదగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోను టీచర్ మను గులాటి స్వయంగా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.
టీచర్ ఇలా ట్వీట్ చేశారు..
"విద్యార్థులు ఉపాధ్యాయులతో స్నేహంగా ఉండేందుకు ఇష్టపడతారు. విద్యార్థుల భవిష్యత్‌కు టీచర్స్ ఎంతో కృషి చేస్తారని... అయితే తను పాఠశాలలో చివరి రోజు కావడంతో క్లాస్ ముగిసిన తర్వాత తాను పిల్లలతో ఆడిపాడి పాడానని తెలిపారు. పిల్లలు నాపై చాలా ప్రేమను చూపించేవారని పేర్కొన్నారు". ఈ ట్వీట్‌లో తను #MyStudentsMyPride #DelhiGovtSchool అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ట్వీట్ చేశారు.
విద్యార్థినితో పాటు టీచర్ కూడా డ్యాన్స్..
ఇంగ్లీష్ టీచర్ క్లాస్ ముగియగానే డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ అంత టీచర్ ముందు డ్యాన్స్‌లు వేస్తూ..ఆమెను ఉత్సాహపరిచారు. ఓ విద్యార్థి టీచర్(గులాటి) మీరు కూడా డ్యాన్స్ చేయాలని అడగగా....విద్యార్థిని కోరిక మేరకు టీచర్ ఓకే చెప్పారు. అయితే ఆమెకు డ్యాన్స్ రాకపోవడంతో విద్యార్థిని డ్యాన్స్‌ను చూస్తూ నెమ్మదిగా స్టెప్స్ వేశారు. ఈ దృశ్యాలను చూస్తూ.. పిల్లలు చప్పట్లు కొట్టారు. ఈ స్టెప్స్‌ను చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: 10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.