10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!

10th Paper Leak: ఏపీలో పదో తరగతి పేపర్ లీక్‌ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నారు. చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో తెలుగు పేపర్-1 ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పేపర్ ప్రత్యక్షమైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 02:53 PM IST
  • ఏపీలో పదో తరగతి పేపర్‌ లీక్‌
  • చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో ప్రశ్నాపత్రాలు లీక్
  • ఖండించిన విద్యా శాఖ
10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!

10th Paper Leak: ఏపీలో పదో తరగతి పేపర్ లీక్‌ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నారు. చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో తెలుగు పేపర్-1 ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పేపర్ ప్రత్యక్షమైంది. పరీక్ష ప్రారంభం అయినా కాసేపటికే లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 

దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌తోపాటు విద్యా శాఖ స్పందించింది. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరీక్షలు ప్రారంభమైన గంటలోపే వాట్సాప్‌ల్లో వదంతులు తెరలేపారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటివి రాష్ట్రంలోనేగాక ఇతర ప్రాంతాల నుంచి లీక్‌ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ విచారణ చేస్తున్నారని డీఈవో స్పష్టం చేశారు. 

ఇటు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి పేపర్‌ లీక్‌ అయ్యింది. పరీక్ష ప్రారంభం కంటే ముందే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్‌ అయినట్లు తెలుస్తోంది. ఇన్విజిలేటర్, సూపర్ వైజర్ లీక్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనపై ప్రభుత్వం సైతం సీరియస్‌ అయ్యింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పరీక్షలు ప్రారంభం అయిన రోజే ఇలా జరగడంపై మండిపడినట్లు తెలుస్తోంది.

మరోవైపు పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనపై పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ స్పందించారు. పరీక్షలు మొదలైన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పేపర్లు వైరల్ అయ్యాయని తెలిపారు. దీనిని లీక్‌గా భావించలేమన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామని..విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యా శాఖ కమిషనర్ సురేష్‌ కుమార్ స్పష్టం చేశారు.

Also read:Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!

Also read:LIC Share Price: ఎల్ఐసీ ఐపీవో ఎప్పట్నించో తెలుసా, ఒక్కొక్క షేర్ ఎంతంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News