Viral Video: ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐతే యూపీలో మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొత్వాలి జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్‌ నాగిని నృత్యం వేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నత అధికారి ట్రంపెట్‌తో తిరుగుతుంటే..కానిస్టేబుల్‌ నాగిని డ్యాన్స్‌ వేసిన దృశ్యాలు కనిపించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిద్దరూ నృత్యం చేస్తున్న సమయంలో చుట్టు పోలీసు సిబ్బంది సైతం ఉన్నారు. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్న విజువల్స్ కనిపించాయి. ఇంతవరకు బాగానే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈవీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా షేర్లు చేస్తూ ..కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు విధులు మరిచి ఇలా చేయడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. 


ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ఎస్సై, కానిస్టేబుల్‌కు బదిలీ చేశారు. ఇప్పటివరకు ట్విట్టర్‌లో ఈ వీడియోను 76 వేల మంది చూశారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫీసు విధుల్లో టిక్‌టాక్‌ చేసి విమర్శలు ఎదుర్కోని సస్పెండ్ అయిన అధికారులు ఉన్నారు. ఇలాంటివి అధికంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.



Also read:Vijayashanthi: రాములమ్మ పార్టీ మారుతున్నారా..బీజేపీ నేతలపై వ్యాఖ్యల వెనుక ఆంతర్యం అదే..!


Also read:Karimnagar: అలుగునూరులో హృదయ విదారక ఘటన..తల్లి మృతదేహం వద్ద చిన్నారుల వేదన..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook