King Cobra Bathing: కింగ్ కోబ్రాకు చల్లని నీళ్లతో స్నానం.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన వీడియో..
King Cobra Bathing: రాచనాగుకు ఒక యువకుడు చల్లనీ నీళ్లతో స్నానం చేయించాడు. బకెట్ నిండా నీళ్లను తీసుకుని పాము మీద వేస్తే అది కూల్ గా తాగుతుంది. అది సదరు వ్యక్తి మీద ఏమాత్రం దాడిచేయకుండా కూల్ గా చల్లని నీళ్లను తాగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.
King Cobra Enjoys Cool Water Shower: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంనుంచి సాయంత్రం వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నాం పూట బైటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో అర్జంట్ పనులుంటే తప్ప, ఎవరు కూడా ఉదయం పదితర్వాత, మద్యాహ్నాంమూడుకంటే ముందు ఎవరు కూడా బైటకు రావడానికి అస్సలు ధైర్యం చేయట్లేదు. ఈ క్రమంలో.. మనుషులే కాదు నోరులేని జీవాలు కూడా అనేక చోట్ల విలవిల్లాడిపోతున్నాయి. ఇక.. చిన్నారులు, పెద్దవయస్సు వారు ఎండధాటికి పిట్టల మాదిరిగా రాలుతున్నారు. కొన్నిచోట్ల నోరులేని జీవాలు, తమ దాహార్తిని తీర్చుకొవడానికి నానా తంటాలు పడుతున్నాయి.
జూలల్లో కూడా చల్లని వాతావరణం కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్ లలో కూలర్లను ఏర్పటు చేస్తున్నారు. చల్లగా ఉండేలా గ్రీనరీ వాతావరణంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఒక రాచనాగుకు ఒక యువకుడు బకెట్ తో స్నానం చేయించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అప్పట్లో ఈవీడియోను చూసి నెటిజన్లు ఎంతో షాకింగ్ కు గురయ్యారు. ఇప్పుడు మరోసారి ఆ వీడియో వైరల్ గా మారింది.
సాధారణంగా రాచనాగులు దట్టంగా ఉన్నచెట్లలో, గుట్టలలో ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇది పరిణామంలో తమ కన్న చిన్నగా ఉన్న పాములను తినేస్తుంటాయి. ఇవి పొరపాటున కాటువేస్తే, కొన్నిసెకన్లలో సదరు వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. అంతటి ప్రమాదకరమైన రాచనాగుకు ఒక వ్యక్తి చన్నీటితో స్నానం చేయించాడు.
Read More: Delhi Metro Romance: మెట్రోలో అమ్మాయిల రోమాన్స్.. డీఎంఆర్సీ రెస్పాన్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
అంతేకాకుండా.. అతను పాముకు నీటిని పోస్తుంటే, అది నీళ్లను తాగుతూ సేదతీరింది. పాముకూడా బసలు కొట్టకుండా కూల్ గా ఆ వ్యక్తి నీళ్లు పోస్తుంటే చల్లని నీళ్లలో కూర్చుని ఉంది. ఈవీడియో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook