Sun Viral picture This huge fireball is actually the Clearest Ever Photo of Our Sun: అందమైన ఫొటోగ్రఫీలో కాస్త ఎక్కువగా సూర్యుడికి సంబంధించిన ఫొటోస్‌ కూడా ఉంటుంటాయి. తెల్లవారుజామున లేదంటే సాయంకాలం సూర్యుడిని కెమెరాలో బంధించి అందమైన చిత్రాలు తీస్తుంటారు ఫొటోగ్రాఫర్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా సూర్యుడికి సంబంధించి అన్ని కోణాల ఫొటోలు మనం చూసి ఉంటాం. అయితే టెలిస్కోప్‌ ద్వారా తీసిన కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భగభగమండే సూర్యుడు ఫోటోలు మనం చాలానే చూసి ఉంటాం.. కానీ ఒక ఫుట్‌బాల్‌లా.. ఆ బంతికి ఏదో అక్కడక్కడ పీచు లేచినట్లుగా...మచ్చలున్నట్లుగా ఎంతో క్లియర్‌‌గా ఉండే సూర్యుడి ఫోటోలను మనకు ఒక ఫొటోగ్రాఫర్ చూపించారు.


ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ (Photographer Andrew McCarthy) తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) సూర్యుడికి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వాటిని క్యాప్చర్ చేసిన విధానాన్ని కూడా వివరంగా తెలియజేశారు. సూర్యుడికి సంబంధించిన డిటేయిల్డ్‌ లుక్ ( detailed look ) ఇది... సూర్యుడిని మరింత మరింత దగ్గరగా చూసేందుకు ఫోటోలను స్వైప్ చేస్తూ వెళ్లండి అంటూ పేర్కొన్నారు. మాడిఫైడ్ చేసిన టెలిస్కోప్‌ని ఉపయోగించి తాను ఎంతో అద్భుతమైన సూర్యుడి ఫొటోలను తీశానని తెలిపారు ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ. దాదాపు 150,000 పైగా పిక్స్‌ను (150,000 images) ఇలా తీసినట్లు పేర్కొన్నారు. ఈ ఫొటో 300 మెగాపిక్సెల్స్ తో (300 megapixels) తీశాను అని తెలిపారు.



 


Also Read : కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టం.. 



అలా ఆయన తీసిన సూర్యుడి ఫొటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ వాటి గురించి వివరించారు..ఇక ఈ ఫొటోలు రియల్లీ అమేజింగ్‌గా ఉన్నాయి. ఫొటోల క్వాలిటీ కూడా అదిరిపోయింది. అలాగే సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహం ఎంత భిన్నంగా ఉందో తెలియజేసే ఫోటోలను ఆయన మన ముందు ఉంచారు. మెక్‌కార్తీ (McCarthy) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మరికొన్ని ఫోటోలపై మీరూ ఒక లుక్ వేయండి మరి..


Also Read : Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook