Tablet cover found in bawarchi biryani: ఒకప్పుడు హైదరబాద్ ను బిర్యానీలో ఫెమస్ అని చెప్తుండేవారు. హైదరాబాద్ బిర్యానీ టెస్ట్ చూసేందుకు ఎక్కడి నుంచో వస్తుండే వారు. ఇక్కడకు వచ్చిన వారు.. బిర్యానీ తినందే వెళ్లకపోయేదని కూడా చెప్తుంటారు.  అలాంటిది.. ప్రస్తుతం ఫుడ్ సెఫ్టీ విషయంలో మాత్రం హైదరాబాద్..  లాస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తొంది. ఇటీవల అనేక హోటల్స్, రెస్టారెంట్లలలో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలలో కాలం చెల్లిన, కుళ్లిపోయిన పదార్థాలను ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని తనిఖీలు చేసిన ఫుడ్ సెప్టీ అధికారులు సైతం షాక్ కు గురైన ఘటనలు జరిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బైటకు వెళ్లినప్పుడు ఆహారంలో.. బొద్దింకలు, కప్పలు, పురుగులు వచ్చిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది బైట తినేందుకు వెళ్దామంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొవచ్చు.


 



కొన్ని రోజుల క్రితమే.. ఒక కస్టమర్ కు బావార్చి బిర్యానీలో.. బొద్దింక పురుగు అవశేషం వచ్చింది. అది జరిగి కనీసం నెల రోజులు కూడా గడవక ముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు..


ఒక కస్టమర్ బావార్చి ఫెమస్ రెస్టారెంట్ అని.. బిర్యానీ తినేందుకు వెళ్లినట్లు తెలుస్తొంది. అతను తనకిష్టమైన బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇంకేముందీ.. మంచి డిష్ లో చూస్తేనే.. నోట్లో నీరు ఊరే మాదిరిగా ఉన్న బిర్యానీ వచ్చి బెరర్ టెబుల్ మీద పెట్టేశాడు. అతను.. ప్లేట్ లో బిర్యానీ వేసుకుని తిందామనుకున్నాడు.. అంతే.. ఏదో మెరుస్తు కన్పించింది.


ఏంటబ్బా.. అని జాగ్రత్తగా చూశాడు. అది ఒక ట్యాబ్లెట్ కవర్.. మరీ దానిలో ఉన్న ట్యాబ్లెట్ ఆ బిర్యానీలో కరిగిపోయిందో ఏంటో కానీ.. ఆ ట్యాబ్లెట్ కవర్ మాత్రం బైటపడింది. అతను అక్కడున్న సిబ్బందిని పిలిచి ప్రశ్నించగా.. సరిగ్గా సమాధానం ఇవ్వలేదని తెలుస్తొంది.


Read more: Viral Video: వామ్మో.. శివయ్యల మారిన వానరం.. మెడలో కింగ్ కోబ్రాతో హల్ చల్.. వీడియో ఇదిగో..


వెంటనే అక్కడున్న వారితో.. ఇదేంటని ఆ ట్యాబ్లెట్ ను చూపించి ప్రశ్నించగా సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.