Ashwin-Pushpa : ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప' క్రేజ్ మామూలుగా  లేదు. ఎక్కడా చూసిన పుష్ప (Pushpa Movie) మూవీ డైలాగ్స్, సాంగ్సే హాల్ చల్ చేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. క్రికెటర్ల అయితే పుష్పరాజ్ ని వదలడం లేదు. భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్యాలు.. పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్ లను తమదైన శైలిలో రీక్రియ్రేట్ చేసి ఆకట్టుకున్నారు. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అయితే రోజుకో పుష్ప వీడియోను విడుదల చేస్తూ..ఈ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయాడు టీమిండియా స్పిన్నర్ అశ్విన్ (Ravi Ashwin). పుష్ప మూవీలోని శ్రీవల్లి పాటలో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్పును బ్యాట్ చేతబట్టి వినూత్నంగా డ్యాన్స్ చేశాడు అశ్విన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఈ వీడియోపై భారత ఫీల్డింగ్ మాజీ కోచ్ ఆర్‌ శ్రీధర్‌‘'తగ్గేది లేదు'  అని కామెంట్‌ చేశాడు. ఆశ్విన్ అభిమానులు, క్రికెటర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూసేయండి మరి.



గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ (Pushpa Movie) ఇప్పటివరకూ రూ.200 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పుష్ప 2 పార్ట్‌ను విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


Also Read: Video: పుష్ప మేనియా.. నానమ్మతో కలిసి పాండ్యా స్టెప్పులు.. ఎంత క్యూట్‌గా ఉందో..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook