Video: పుష్ప మేనియా.. నానమ్మతో కలిసి పాండ్యా స్టెప్పులు.. ఎంత క్యూట్‌గా ఉందో..

Hardik Pandya dance with his grandma for Pushpa song: పుష్ప మేనియా అందరినీ షేక్ చేస్తోంది. పుష్ప సాంగ్ వినబడితే చాలు కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు జనాలు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం పుష్ప ఫీవర్‌తో ఊగిపోతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 09:29 PM IST
  • నానమ్మతో కలిసి క్రికెటర్ పాండ్యా స్టెప్పులు
  • పుష్ప పాట 'శ్రీవల్లి'కి స్టెప్పులేసిన పాండ్యా, అతని నానమ్మ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Video: పుష్ప మేనియా.. నానమ్మతో కలిసి పాండ్యా స్టెప్పులు.. ఎంత క్యూట్‌గా ఉందో..

Hardik Pandya dance with his grandma for Pushpa song: టాలీవుడ్‌లోనే కాదు ప్రస్తుతం ఇండియా మొత్తాన్ని పుష్ప ఫీవర్ (Pushpa) షేక్ చేస్తోంది. ఎక్కడ విన్నా పుష్ప పాటలు, డైలాగులే.. ఎక్కడ చూసినా పుష్ప స్టెప్పులే. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతీ ఒక్కరూ పుష్ప స్టైల్‌ను ఫాలో అయిపోతున్నారు. తాజాగా టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన నానమ్మతో కలిసి పుష్ప పాటకు స్టెప్పులేశారు.

పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి' పాటకు (Pushpa Song) పాండ్యా, అతని నానమ్మ అల్లు అర్జున్‌ను (Allu Arjun) అనుకరిస్తూ కాలు కదిపారు. చివరలో గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదెలా అంటూ పోజులిచ్చారు. అంత వయసులోనూ పాండ్యాతో కలిసి అతని బామ్మ స్టెప్పులేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వావ్.. సో క్యూట్... అంటూ వీడియోపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే 18,23,440 పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

చూస్తుంటే... పుష్ప సాంగ్స్‌కు క్రికెటర్లు బాగా కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే శిఖర్ ధావన్, సురేష్ రైనా, డేవిడ్ వార్నర్ పుష్ప సాంగ్స్‌కు స్టెప్పులేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చాలామంది విదేశీయులు సైతం పుష్ప సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికొస్తే... గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ (Pushpa Movie) ఇప్పటివరకూ రూ.200 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పుష్ప 2 పార్ట్‌ను విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: Daibetes patients: బ్లడ్ షుగర్ లెవల్స్ సడెన్‌గా పడిపోతే.. ఈ ఐదు ఫుడ్స్ తీసుకోండి..

Also read: కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News