Costly Beggar: వావ్.. యాచకురాలి వద్ద కాస్లీ ఐఫోన్.. అవాక్కైన పోలీసులు.. ఎక్కడంటే..?
Hyderabad: పోలీసులు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో దాదాపు 15 మంది యాచకులను పట్టుకుని పునారావాస కేంద్రానికి తరలించారు.
Hyderabad Police Find Costly IPhone In Beggars Hand: మనం బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు, సిగ్నల్స్ దగ్గర యాచకులను చూస్తుంటాం. సిగ్నల్ పడగానే వాహనాల దగ్గరకు వచ్చి మరీ బెగ్గింగ్ చేసుకుంటారు. కొందరు తమకు తోచిన విధంగా బెగ్గర్స్ కు డబ్బులు ఇస్తుంటారు. అయితే.. కొన్నిప్రదేశాలలో బెగ్గింగ్ కూడా ఒక మాఫియా మాదిరిగా మారిపోయింది. కొందరు ముఠాలుగా ఏర్పడి తమ అమాయకులైన పిల్లలు, అనాథలను సిగ్నల్ దగ్గర బెగ్గింగ్ కు పురిగొల్పుతున్నారు.
Read More: Urvashi Rautela: పుట్టినరోజు నాడు చెమటలు పట్టించిన 'వాల్తేరు వీరయ్య' సుందరి
ఏమాత్రం సంబంధంలేని చిన్న పిల్లలను, తల్లులకు ఇచ్చి బెగ్గింగ్ చేయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు బెగ్గింగ్ చేస్తు, కోటిశ్వరులైన ఘటన వార్తలలో నిలిచింది. అనేక చోట్ల బెగ్గర్స్ లు రోడ్డుమీద బెగ్గింగ్ చేస్తూ, తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో కూడా చదివిస్తున్న అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొందరు బెగ్గింగ్ ద్వారా వచ్చిన డబ్బులను వడ్డీలకు కూడా ఇస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ లో కూడా ఉంటున్న ఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి.
తాజాగా, హైదరాబాద్ పోలీసులు యాచకులకు పునారావాసం కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా చర్యలు చేపట్టారు. దీనిలో దాదాపు.. 15 మంది యాచకులను పలు ప్రాంతాలలో పునారావాసం కల్పిస్తున్నారు. ఈ తనిఖీలలో పోలీసులు ఒక యాచకురాలి వద్ద కాస్లీ ఐఫోన్ ను గుర్తించారు.
Read More: Deepika Padukone: ప్రెగ్నెన్సీ డైట్ బయటపెట్టిన దీపికా పడుకోణె.. ఫోటోలు చూశారా..
ఆమె దాన్ని ఉపయోగించడం చూసి పోలీసులు అవాక్కైయ్యారు. దీనిపై ఆమెను పోలీసులు వివరణ కోరగా.. తానే కొనుగోలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాచకురాలు ఐఫోన్ ఎప్పుడు, ఎలా కొన్నదనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.